Home » మ‌ర‌ణించే ముందు ఏఎన్నార్ అంద‌రినీ ఎందుకు దూరం పెట్టారు..? సంచ‌ల‌న వాస్త‌వాలు వెల్ల‌డించిన కాదంబ‌రి కిర‌ణ్

మ‌ర‌ణించే ముందు ఏఎన్నార్ అంద‌రినీ ఎందుకు దూరం పెట్టారు..? సంచ‌ల‌న వాస్త‌వాలు వెల్ల‌డించిన కాదంబ‌రి కిర‌ణ్

by Anji
Published: Last Updated on

అక్కినేని నాగేశ్వ‌ర్ రావు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ పేరు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఓ బ్రాండ్ అనే చెప్పాలి. ఎన్టీఆర్ తో పాటు ఏఎన్నార్ తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి రెండు క‌ళ్ల‌లాంటి వారు అంటారు. 90 ఏళ్ల‌కు పైగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో, ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని చూసిన ఏఎన్నార్ చివ‌రి రోజుల్లో ఎవ్వ‌రినీ ద‌గ్గ‌రికీ రానివ్వ‌లేద‌ట‌. ఎందుకు..? ఏమిటి అనే కార‌ణాలు, కాదంబ‌రి కిర‌ణ్ చెప్పిన వాస్తవాలు ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


తెలుగు ఇండ‌స్ట్రీ లెజండ‌రీ యాక్ట‌ర్స్‌లో తొలి వ‌రుస వారిది. అందులో ఏఎన్నార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. దాదాపు 90 ఏళ్ల‌కు పైగా జీవించిన ఏఎన్నార్ క్యాన్స‌ర్ బారీన ప‌డి చ‌నిపోయారు. సినీ ఇండ‌స్ట్రీని అభివృద్ధి చేసిన మ‌హానుభావుల్లో ఏఎన్నార్ ఒక‌రు. టాలీవుడ్‌కి వెస్ట్ర‌న్ స్టెప్పులు నేర్పిన అక్కినేని చేసిన ప్ర‌తీ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అనే చెప్పాలి. ఎన్నో కుటుంబ నేప‌థ్య క‌థా చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ఈ సినిమా చివ‌రి ద‌శ‌లో క్యాన్స‌ర్ వ్యాధితో మృతి చెందారు. చివ‌రి రోజుల్లో త‌న ద‌గ్గ‌రికీ కూడా రానీయ‌లేద‌నే విష‌యం రీసెంట్ గా వైర‌ల్ అవుతోంది.


ముఖ్యంగా టాలీవుడ్ న‌టుడు కాదంబ‌రి కిర‌ణ్ కు ఏఎన్నార్‌కి మంచి అనుబంధం ఉంది. ఇక అక్కినేనిని కాదంబ‌రి ఎంతో ఆరాధించే వారు. ఇక తాజాగా అక్కినేని గురించి కాదంబ‌రి కిర‌ణ్ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు చివ‌రి రోజుల్లో ఉన్న‌ప్పుడు చూసిన‌టువంటి ఏకైక వ్య‌క్తిని తానే అని చెప్పారు. ఏఎన్నార్ చ‌నిపోయే కొద్ది రోజుల ముందు ఆయ‌న‌ను ఎక్క‌డ ముట్టుకున్నా చ‌ర్మమే ఊడివ‌చ్చేద‌ని పేర్కొన్నారు. చివ‌రి రోజుల్లో త‌న ఫ్యామిలీని కూడా ద‌గ్గ‌రికీ రానివ్వ‌లేద‌ని.. అందుకు ఓ కార‌ణం ఉంద‌ని చెప్పాడు.


ఎవ‌రైనా ఏఎన్నార్‌ను చూసి ఏడిస్తే ఆయ‌నకు అధైర్యం క‌లుగుతుంద‌ని.. త‌న ఫ్యామిలీ ఏడిస్తే ఇంకా అధైర్యం క‌లుగుతుంద‌నే కార‌ణంచేత చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంల చాలా మందిని చూడ‌డానికి ఆయ‌న ఇష్ట‌ప‌డ‌లేదు అని చెప్పారు కాదంబ‌రి. అదే స‌మ‌యంల ఉద‌య్ కిర‌ణ్ ఆత్మ‌హత్య చేసుకున్నాడు. చాలా బాగా న‌టించి మంచి సంపాదించిన కుర్రాడు అలా చేసి ఉండ‌కూడ‌ద‌ని ఏఎన్నార్ అన్నార‌ని కిర‌ణ్ చెప్పారు. అంద‌రికంటే ఎక్కువ‌గా తానే ఎన్నార్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు. అక్కినేని త‌లుచుకుని కాదంబ‌రీ చాలా బాధ‌ప‌డ్డాడు. ఏఎన్నార్ చ‌నిపోయే స‌మ‌యంలో ముంబ‌యిలో ఉండ‌డంతో అంత్య‌క్రియ‌ల‌కు రాలేక‌పోయాన‌ని తెలిపారు. నా ప్రాణం నిల‌బెట్టిన వ్య‌క్తుల్లో ఏఎన్నార్ ఒక‌ర‌ని కిర‌ణ్ పేర్కొన్నారు.

Also Read :

1980లో NTR, ANR, కృష్ణ‌, శోభ‌న్ బాబుల రెమ్యునరేష‌న్స్ ఎంతంటే?

ఆర్తి అగ‌ర్వాల్ విషం తాగ‌డానికి గ‌ల‌ కారణాన్ని చెప్పిన త‌రుణ్ త‌ల్లి..!

Visitors Are Also Reading