Home » కారు కొన్న సంతోషం.. అంత‌లోనే క‌చ్చాబాదామ్ సింగ‌ర్ కు ప్ర‌మాదం

కారు కొన్న సంతోషం.. అంత‌లోనే క‌చ్చాబాదామ్ సింగ‌ర్ కు ప్ర‌మాదం

by Anji
Ad

క‌చ్చాబాద‌మ్ సాంగ్ సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపేసిన విష‌యం తెలిసిందే. ఇన్‌స్ట్రాగ్రామ్‌, యూట్యూబ్ రీల్స్‌ల‌లో విప‌రీతంగా అందించారు. ఇంకా ఆదిరిస్తున్నారు ప్ర‌జ‌లు. ప‌చ్చి ప‌ల్లీలు, ఓ వీధి వ్యాపారి ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపుల‌నే పాట‌గా మ‌లిచి క్రేజీనెస్ తీసుకొచ్చారు. ఈ త‌రుణంలో ఆ ప‌ల్లీల వ్యాపారి జీవిత‌మే మారిపోయింది. అయితే తాజాగా వైర‌ల్ సెన్సేష‌న్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డారు. పాత సామాన్లు ఇచ్చి ప‌చ్చి ప‌ల్లీలు తీసుకెళ్లండంటూ గ‌ల్లీలో తిరుగుతూ త‌న‌దైన శైలిలో పాడుతూ జ‌నాల‌ను ఆక‌ట్టుకునే వాడు.

Also Read  :  భీమ్లానాయ‌క్” లో సునీల్ పాత్ర‌ను క‌ట్ చేసిన‌ త్రివిక్ర‌మ్..కార‌ణం ఇదే..!

Advertisement

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన భూబ‌న్ బ‌ద్యాక‌ర్ క‌చ్చాబాదామ్ పాట‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ త‌రుణంలో ద‌క్కిన కొద్దిపాటి రెమ్యున‌రేష‌న్‌తో సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాడు. సోమ‌వారం స్వ‌యంగా తానే కారును నేర్చుకునే క్ర‌మంలో యాక్సిడెంట్‌కు గుర‌య్యాడు. ఛాలిలో బ‌ల‌మైన గాయం కావ‌డంతో కుటుంబీకులు అత‌న్ని ఆసుప‌త్రిలో చేర్చారు. ప్ర‌స్తుతం బద్యాక‌ర్ ప‌రిస్థితి నిల‌క‌డగానే ఉన్న‌ట్టు స‌మాచారం.

Advertisement

ముఖ్యంగా క‌చ్చా బాదామ్ సాంగ్ అత‌ని జీవితాన్నే మార్చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. ప‌గిలిపోయిన వ‌స్తువుల‌ను తీసుకొని వాటికి బ‌దులు ప‌ల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వ‌చ్చే 200, 300 రూపాయ‌ల‌తో జీవ‌నం కొన‌సాగించేవాడు. తొల‌త ఆ పాట వైర‌ల్ అయిన‌ప్పుడూ త‌న‌కు క్రెడిట్ ద‌క్క‌లేద‌ని గోల చేసిన భూబ‌న్, తీరా అది ద‌క్కాక పూర్తిగా మారిపోయాడు. ఇక‌పై ప‌ల్లీలు అమ్ముకోన‌ని సింగింగ్ కెరీర్‌లోనే కొన‌సాగుతాన‌ని.. ఈ క్రేజ్ కార‌ణంగా త‌న‌ను కిడ్నాప్ చేస్తారేమోన‌ని భ‌యంగా ఉందంటూ భూబ‌న్ పోలీసుల‌ను సైతం ఆశ్ర‌యించాడు. ఆ బిల్డ‌ప్ చూసి అప్ప‌టిదాకా అత‌న్ని మెచ్చుకున్న వాళ్లే తిట్టుకున్నారు. తాజాగా కోల్‌క‌తాలోని ఓ షోష్ క్ల‌బ్‌లో అత‌గాడు రాక్‌స్టార్ అవ‌తారంలో ప్ర‌ద‌ర్శ‌న కూడా ఇవ్వ‌డం చూసి చాలా మంది ముక్కున వేలేసుకున్నారు.

Visitors Are Also Reading