Home » “భీమ్లానాయ‌క్” లో సునీల్ పాత్ర‌ను క‌ట్ చేసిన‌ త్రివిక్ర‌మ్..కార‌ణం ఇదే..!

“భీమ్లానాయ‌క్” లో సునీల్ పాత్ర‌ను క‌ట్ చేసిన‌ త్రివిక్ర‌మ్..కార‌ణం ఇదే..!

by AJAY
Ad

పవర్ స్టా.ర్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. ఇక ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది కూడా…. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ను భీమ్లా నాయ‌క్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమాలో రానా కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

 

ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర‌ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట‌లు అందించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు. మరో వైపు ఈ సినిమాకు త్రివిక్రమ్ బ్యాక్ బోన్ గా ఉన్నారని తెలుస్తోంది. అసలు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఓకే చెప్పడానికి కారణం త్రివిక్రమ్ కూటా అని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ లో న‌టుడు సునీల్ తో పాటు జబర్దస్త్ కామెడియ‌న్ లు హైపర్ ఆది, సప్తగిరి కనిపిస్తారు.

Advertisement

Bheemla nayak

పాటలో సునీల్ పోలీస్ పాత్రలో కనిపించగా ఆది ఖైది పాత్రలో కనిపిస్తాడు కానీ ఆ త‌ర‌వాత మాత్రం వీళ్లు సినిమాలో కనిపించరు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సునీల్ కూడా న‌టించాడు. కేవ‌లం టైటిల్ సాంగ్ లో మాత్రకే కాకుండా ఆ త‌ర‌వాత కూడా సునీల్ పాత్ర సినిమాలో ఉంది. జైలులో ఉన్న ఖైదీలకు పవన్ కళ్యాణ్ గురించి చెప్పే పాత్రలో సునీల్ కనిపిస్తాడట.

bheemla nayak adavi thalli song

కానీ పాత్ర నిడివి ఎక్కువ అవడంతో సునీల్ సీన్ల‌ను త్రివిక్రమ్ క‌ట్ చేశారట. ఇదిలా ఉంటే సునీల్ కెరీర్ ప్రారంభం లో క‌మెడియ‌న్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ క‌మెడియ‌న్ గా ఇండ‌స్ట్రీలో ఎదిగాడు. కానీ ఆ త‌ర‌వాత కేవ‌లం హీరోగా సినిమాలు చేసి వ‌రుస ఫ్లాప్ లు మూట‌గ‌ట్టుకున్నాడు. ఇప్పుడు తీరు మార్చుకుని విల‌న్ గా క‌మెడియ‌న్ గా న‌టిస్తూనే హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు.

Visitors Are Also Reading