Home » కేఏ పాల్ కు చెంపదెబ్బ.. ఎక్కడో తెలుసా..!!

కేఏ పాల్ కు చెంపదెబ్బ.. ఎక్కడో తెలుసా..!!

Ad

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా జక్కాపూర్ గ్రామంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ పై ఒక వ్యక్తి అనూహ్యంగా దాడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించడానికి కోసం వచ్చిన కేఏ పాల్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలోనే కె.ఎ.పాల్ ను ఒక వ్యక్తి వచ్చి చెంపదెబ్బ వేశారు. ఈ తరుణంలో కె ఏ పాల్ కు మరియు ఆ చెంపదెబ్బ చేసిన వ్యక్తికి కాసేపు తోపులాట జరిగింది.

Advertisement

వెంటనే స్పందించిన పోలీసులు దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని దాని అనంతరం కే ఏ పాల్ హైదరాబాద్ కు పంపించారు. తన పర్యటనకు సంబంధించిన సమాచారం ముందుగానే పోలీసులకు అందించామని అయినా తనను అడ్డుకొని ఇలా చేశారని ఆరోపించారు. తనపై దాడి జరగడం మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు తెలియజేశారు.

Advertisement

కే ఏ పాల్ పర్యటనలో గొడవ జరిగే అవకాశం ఉందన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లమని, ఆ వైపు కే ఏ పాల్ వెళ్లవద్దని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ చెప్పిన అతను వినలేదని అందుకే మేము అక్కడికి వెళ్లామని తెలియజేశారు. కే ఏ పాల్ పై దాడి చేసిన వ్యక్తి రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ అనిల్ గా గుర్తించారు. కె ఏ పాల్ మరియు ఆయన అనుచరులు రైతులను సన్నాసులు అని తీట్టారని అలా అనకూడదు అంటే తనపై దాడి చేసినట్టు తెలిపారు. అందుకే నేను దాడి చేయాల్సి వచ్చిందని అని ఆరోపించారు. ఈ తరుణంలో రాజన్న సిరిసిల్ల ఎస్పీకి అనిల్ ఫిర్యాదు చేశారు.

ALSO READ :

40 ఏళ్లు దాటిన త‌ర‌వాత బిడ్డ‌ల‌కు జ‌న్మనిచ్చిన స్టార్ హీరోయిన్లు..!

Dasari…. చిరు, బాల‌య్య‌, నాగార్జున‌ల‌కు ఇచ్చిన ట్యాగ్ లైన్స్ ఏంటి? 1992 నాటి ముచ్చ‌ట‌!

 

 

Visitors Are Also Reading