Home » BREAKING : జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరిక… మీ పద్ధతి మార్చుకోండి ?

BREAKING : జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరిక… మీ పద్ధతి మార్చుకోండి ?

by Bunty
Published: Last Updated on
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇక RRR సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు జూనియర్ ఎన్టీఆర్. తన అద్భుతమైన నటనతో, డాన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాడు. అయితే ఎన్టీఆర్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పద్ధతి మార్చుకోవాలని ఎన్టీఆర్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. దానికి గల కారణం ఏంటంటే… ఓసారి ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద కాస్త సీరియస్ అయ్యాడట.

Advertisement

అంతేకాకుండా ఈ మధ్య మరోసారి అలాగే సీరియస్ అయ్యారట. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘దేవర’. ఈ సినిమా ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించి లీకులు ఎప్పుడు వారిని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఎన్టీఆర్ షూటింగ్ లోకేషన్ కి వెళ్లడం నుంచి మొదలు పెడితే అక్కడి పరిసరాలు, లొకేషన్లు, షూటింగ్ క్లిప్ లు ఎప్పటికప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఎంత పకడ్బందీగా ఈ సినిమా షూటింగ్ ని నిర్వహించినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో లీకు బయటకు వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్టీఆర్ చాలా సీరియస్ అయ్యాడట. మీరు అత్యుత్సాహంతో షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Advertisement

దీంతో సినిమాపై ఉన్న అంచనాలను తగ్గిస్తున్నాయి. అంతేకాకుండా ఈ లీకుల వల్ల సినిమాపై ప్రెషర్ పడుతుందని అన్నారట. దీంతో ఎన్టీఆర్ మూవీ టీమ్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి మార్చుకోవాలని లేకపోతే ఈ సినిమా టీం నుంచి తొలగిస్తామని ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చారట. అయితే ఈ వార్త నిజమో, కాదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ ‘దేవర’ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను చూసి నెటిజెన్లు మెచ్చుకునేలా చేస్తుంది. అంతేకాకుండా అఫీషియల్ అప్డేట్ కూడా ఇవ్వచ్చు కదా తారక్ అన్న అని కామెంట్లు పెడుతున్నారు.

Visitors Are Also Reading