Home » june 8th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 8th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. 13 నామినేషన్లను తిరస్కరించారు.15 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపు చివరి గడువు కావడం తో పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి.

 

మెదక్ జిల్లా నర్సాపూర్ బస్ డిపోను నేడు ప్రారంభించనున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్థిక మంత్రి హరీష్ రావు కలిసి ఈ డిపోను ప్రారంభించనున్నారు. 15 బస్సులు 50 మంది సిబ్బందితో నర్సాపూర్ డిపో పనిచేయనుంది.

Advertisement

 

నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీవారిని దర్శించుకుని అనంతరం సాయంత్రం మహతిలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననబోతున్నారు.

 

పబ్ కేసులో ఎమ్మెల్యే కుమారుడిని సైతం పోలిసులు అరెస్ట్ చేశారు. ఆరో నిందితుడి కింద అతడిని అరెస్ట్ చేసినట్టు సీపీ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఇకపై ప్రతి పబ్‌పై నిఘా పెడతామని… పబ్‌లోకి మైనర్లను అనుమతించకూడదని హెచ్చరించారు.

 

ఏపీలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని… ఏపీకి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.

Advertisement

 

తెలంగాణ ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు పెరగాలి.. నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు రూ.3వేలు పారితోషికం ఇస్తామని మంత్రి హరీష్‌రావు బంపర్ ఆఫర్ ఇచ్చారు.

 

మత్రి సత్యేంద్రకుమార్ జైన్ ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. మంత్రి ఇంట్లో భారీ ఎత్తున నగదు, బంగారంను అధికారులు పట్టుకున్నారు. రూ.2.85 కోట్ల నగదు, 1.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

modi

హైదరాబాద్ వేదికగా బీజేపీ కీలక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. జూలై 2,3 తేదీలలో హెచ్ఐసీసీ వేదికగా బిజెపి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోడీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా లో అరుదైన రికార్డును సృష్టించారు. క్రికెట్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా విరాట్ నిలిచారు. దాంతో విరాట్ ఫాలోవర్స్ సంఖ్య రెండు వందల మిలియన్స్ కు చేరింది.

 

మహమ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలకు ప్రతీకారంగా ఢిల్లీ, ముంబై, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని టెర్రరిస్ట్ గ్రూప్ అల్ కైదా హెచ్చరిస్తూ లేఖను విడుదల చేసింది. ప్రవక్త పై వ్యాఖ్యలు చేసిన వాళ్లని చంపేస్తామని… ఆర్మీ మధ్యలో ఉన్న వదిలిపెట్టమని పేర్కొంది.

Visitors Are Also Reading