Home » june 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 1st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
Ap cm jagan

Ap cm jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ రేపు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ను క‌లిసే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. తాజా రాజకీయ పరిణామాలు, దావోస్ పర్యటన, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం చర్చించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ల పంపిణీ కొన‌సాగుతోంది. 60.75 లక్షల మంది పెన్షనర్లకు రూ.1543.80 కోట్ల నిధుల‌ను విడుదల చేశారు. ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 08.00 గంటల వరకు 29.32 లక్షల మందికి రూ.744.02 కోట్లు పంపిణీ చేసిన‌ట్టు మంత్రి ముత్యాలనాయుడు వెల్ల‌డించారు.

Advertisement

తెలంగాణలో గ్రూప్-1కు 3,35,143 దరఖాస్తులు వ‌చ్చాయి. 2011లో ఉమ్మడి ఏపీలో 302 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వ‌గా 3,02, 912 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇప్ప‌డు తాజాగా ఒక్క తెలంగాణలోనే 3.35 లక్షలకు పైగా దరఖాస్తులు రావ‌డంతో కాంపిటేష‌న్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

తెలంగాణలో మద్యం రేట్లు పెంచినా అమ్మకాలు మాత్రం త‌గ్గ‌లేదు. మే నెలలో మ‌ద్యం అమ్మకాలు రూ.3 వేల కోట్లు దాటేశాయి. ఏప్రిల్ నెలలో రూ.2,700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్ల‌డించారు.

Advertisement

తిరుమలలో జూన్ 1 నుంచి పూర్తిగా ప్లాస్టిక్ వాడ‌కం పై నిశేదం విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అలిపిరి టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామ‌ని అధికారులు ప్ర‌క‌టించారు. దుకాణదారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలి ఆదేశాలు జారీచేశారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కేంద్రం పై నిప్పులు చెరిగారు. మోడీ అండ‌తోనే అదానీ ప్ర‌ధానీలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. అదానీకి కేంద్ర ప్ర‌భుత్వ ఆస్తులను దారాద‌త్తం చేస్తున్నార‌ని క‌విత ఆరోపించారు.

కోస్తా రాయ‌ల‌సీమ‌లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. గంట‌కు 30 నుండి 40 కిమీల వేగంతో గాలులు వీసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు సూచించారు.

ఏపీ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అన్ని ర‌కాల డిజిట‌ల్ చెల్లింపుల‌ను స్వీక‌రించేలా నిర్ణ‌యం తీసుకుంది. విజ‌య‌వాడ‌, గుంటూరు డిపోల‌లో పైలెట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రారంభించనున్నారు.


జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌పై అక్ర‌మ కేసుల విష‌యమై అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డి కి ఫిర్యాదు చేయ‌నున్నారు.

దేశంలో జ‌నాభా నియంత్ర‌ణచ‌ట్టం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. కేంద్ర‌ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండ‌స్ట్రీస్ మంత్రి ఓ స‌మావేశంలో మాట్లాడుతూ త్వ‌ర‌లోనే కేంద్ర జ‌నాభానియంత్ర‌ణ చ‌ట్టం తీసుకువ‌స్తోందని తెలిపారు.

Visitors Are Also Reading