Home » june 14th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

june 14th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు మధ్య రాత్రి 7 గంటలకు మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో సౌతాఫ్రికా ఉంది.

Ap cm jagan

Ap cm jagan

సీఎం జగన్ నేడు శ్రీసత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా సొమ్ము విడుదల చేయనున్నారు. జగన్, గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పంటల బీమా విడుదల చేశారు. రాష్ట్రంలో 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.82 కోట్లు విడుదల చేయనున్నారు.

Advertisement

నేడు మరోసారి విచారణకు రావాలని రాహుల్‌ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నిన్న 10 గంటల పాటు రాహుల్‌ను ఈడి ప్రశ్నించింది.

Advertisement

గత రాత్రి హైరాబాద్ లో భారీ వర్షం కురిసింది. కాప్రా, ఏ.ఎస్.రావు నగర్, హెచ్.బి.కాలనీ, చర్లపల్లి, దమ్మాయిగూడ, నాగారం, కీసర…పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. వర్షానికి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

విశాఖ రుషికొండ బీచ్ లో ఇండియన్ క్రికెటర్స్ సందడి చేశారు. సరదాగా సముద్ర స్నానాలు చేస్తూ ప్లేయర్స్ ఎంజాయ్ చేశారు. బీచ్ రోడ్ లోని ఓ హోటల్ లో ఇరు టీం జట్లు బస చేశాయి.

పెరిగిన ధరలతో ఆర్టీసీ కి కాసుల వర్షం కురుస్తోంది. డీజిల్ సెస్ తో ప్రభుత్వం టికెట్ ధరలను పెంచింది. ఒక్కరోజే ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో రూ.5 లక్షల ఆదాయం వచ్చింది.

తెలంగాణ లోని ప్రభుత్వ స్కూల్స్ లో వారంలో మూడు రోజులు కోడిగుడ్లు తప్పనిసరి ఇవ్వాలని పాఠశాల డైరెక్టర్ శ్రీదేివసేన అధికారులను ఆదేశించారు.

న్నత విద్యాశాఖ లో 5,083 పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని ఆ శాఖ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Visitors Are Also Reading