Home » ఉరిశిక్ష తీర్పు తరువాత జడ్జిలు పెన్ మొనను విరగగొడతారు… ఎందుకంటే?

ఉరిశిక్ష తీర్పు తరువాత జడ్జిలు పెన్ మొనను విరగగొడతారు… ఎందుకంటే?

by aravind poju
Published: Last Updated on
Ad

ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేస్తే చేసిన తప్పును బట్టి న్యాయ స్థానాలు తగిన శిక్ష విధిస్తుంటాయి. న్యాయస్థానాలు విధించే శిక్షలలో అత్యంత కఠినమైన శిక్ష ఉరిశిక్ష. అంత సులభంగా ఉరి శిక్ష విధించరు. ఏదైనా చేయరాని అత్యంత ఘోరమైన తప్పు చేసినప్పుడు మాత్రమే ఉరి శిక్ష విధిస్తారు. అయితే ఉరిశిక్షకు ముందు నేరం చేసిన నిందితుడికి రాష్ట్రపతి క్షమాభిక్ష అవకాశం ఒకటి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష రద్దవుతుంది. లేకపోతే గౌరవ న్యాయమూర్తి నిర్ణయం ప్రకారం ఉరి శిక్ష అమలవుతుంది.ఏతే ఉరిశిక్ష తీర్పు వెల్లడించిన తరువాత సదరు గౌరవ జడ్జి పెన్ను మొనను విరగగొడతారు అని చాలరోజులుగా ప్రచారంలో ఉంది.

        Also Read: ఈ హీరోల భార్య‌ల సంపాద‌న తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..?

Advertisement

Advertisement

అయితే ఎందుకు విరగగొడతారనే దానిపై చాలా రకాల విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ అసలైన కారణం మాత్రం ఎక్కడా ఖచ్చితంగా చెప్పలేదు. కావున ఇప్పుడు మనం ఉరిశిక్ష తీర్పు తరువాత జడ్జిలు పెన్ మొనను విరగగొడతారనే విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకు విరగగొడతారు అంటే ఎవరికైతే ఉరి శిక్ష విధించబడిందో అతని జీవితానికి పులిస్టాప్ పడ్డట్టు కదా. అంతేకాక ఈ పెన్నుతో ఇచ్చిన తీర్పుతో ఒకరి ప్రాణం తీశాం అనే ఆలోచన రాకూడదు అనే ఉద్దేశ్యంతో పెన్ను మొనను విరగగొడతారట. ఏది ఏమైనా ఇది ఎంతో బాధాకరమైన విషయం అని న్యాయమూర్తులకు ఉన్నా సదరు నిందితుడు చేసిన తప్పుకు ఇదే సరైన శిక్ష అని భావించినప్పుడే ఉరి శిక్ష అనే తీర్పును వెల్లడిస్తారు.

why judges break pen nib

why judges break pen nib

అయితే ఉరిశిక్ష తీర్పు ఇచ్చాక వెంటనే శిక్షను అమలు పరచరు. ఆ తరువాత చాలా రకాల న్యాయపరమైన ప్రక్రియ ఉంటుంది. ఉరిశిక్ష విధించే సమయంలో నిందితుడు పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. ఏ మాత్రం అనారోగ్యంగా ఉన్నా ఉరి శిక్షను అమలు పరచరు. ఆ తరువాత అనారోగ్యం నుండి కోలుకున్నాక మాత్రమే మరల యధావిధిగా ఉరిశిక్షను అమలు పరుస్తారు.

Also Read: 7నెల‌లు కాపురం చేసి మోసం చేసిన భ‌ర్త‌…అత‌డి ఇంటి ముందే భార్య వినూత్న నిర‌స‌న‌..!

Visitors Are Also Reading