Home » Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఒడిలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?

by Bunty
Ad

జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయికి ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ” దేవర ” సినిమా చేస్తున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Jr NTR Photo Look With a Children In Social Media Goes

Jr NTR Photo Look With a Children In Social Media Goes

ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ చిన్నారిని… తన ఒళ్ళో కూర్చో పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ . ఎంతో క్యూట్ గా ఉన్న ఆ చిన్నారి… ఎన్టీఆర్ తో చాలా హ్యాపీగా కనిపించింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఈ తరుణంలోనే ఆ చిన్నారి ఎవరు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Advertisement

అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు కానీ… జబర్దస్త్ రాంప్రసాద్ మాత్రం తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న ఆ చిన్నారి తన మేనకోడలు అంటూ… జబర్దస్త్ రాంప్రసాద్ తెలిపాడు. అయితే దేవర షూటింగ్ సమయంలో… జూనియర్ ఎన్టీఆర్ తో తన మేనకోడలు ఫోటో దిగినట్లు చెప్పుకొచ్చాడు రాంప్రసాద్. ఇది ఇలా ఉండగా దేవర సినిమా తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ చేస్తున్న వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2024లో రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading