Home » జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఏకైక‌ టీవీ సీరియల్ ఏదో తెలుసా…!

జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ఏకైక‌ టీవీ సీరియల్ ఏదో తెలుసా…!

by AJAY
Ad

నంద‌మూరి న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. జ‌క్క‌న్న తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి పాత్ర‌లో న‌టించగా….ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియాకు ప‌రిచ‌యం అయ్యాడు. అంతే కాకుండా ఎన్టీఆర్ త‌న నట‌న‌తో సినిమాలో ఔరా అనిపించాడు.

jr ntr in serial

Advertisement

 

ఇక ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ దర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ సినిమాలో అలియా భ‌ట్ హీరోయిన్ గా న‌టించబోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో జ‌న‌తాగ్యారేజ్ సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దాంతో వీరి కాంబినేష‌న్ పై అంచనాలు పెరిగిపోయాయి.

Advertisement

ఇక పాన్ ఇండియా లో ఎన్టీఆర్ క్రేజ్ పెర‌గ‌టంతో ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా త‌ర‌వాత ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ తో స‌లార్ సినిమాను తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌లార్ పూర్త‌యిన త‌ర‌వాత ఎన్టీఆర్ తో సినిమా షురూ అయ్యే అవ‌కాశం ఉంది.

Also Read: ఈ ఫోటోలో ఉన్న బాబు ప్ర‌స్తుతం ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ కేవ‌లం సినిమాల్లోనే కాకుండా ఓ టీవీ సీరియ‌ల్ లో కూడా న‌టించారు. కానీ ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఎన్టీఆర్ ఈటీవీలో ప్ర‌సార‌మైన భ‌క్త‌మార్కండేయ సీరియ‌ల్ లో న‌టించారు. ఈ సీరియ‌ల్ లో ఎన్టీఆర్ లీడ్ రోల్ లో భ‌క్త‌మార్కండేయ పాత్ర‌లో న‌టించారు. ఇక ఈ సీరియ‌ల్ లో ఎన్టీఆర్ త‌న న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు అందుకున్నాడు కూడా.

Also Read: Rajamouli ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన విల‌న్స్! ఒక్కో సినిమాలో ఒక్క‌రు!

Visitors Are Also Reading