ఇంగ్లాండ్ క్రికెట్ లో ఈ ఏడాది చాలా మార్పులు జరుగుతున్నాయి అనేది అందరికి తెలిసిందే. ఈ మధ్య కాలంలోనే టెట్ కెప్టెన్సీ నుండి ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తప్పుకున్నాడు. జట్టుకు విజయాలు అందించలేకపోతున్నాడు అనే కారణంగా అతని పై వస్తున్న విమర్శలతో.. తనకు ఈ బాధయ్తహాలు వద్దు అంటూ అందులోనుండి పక్కకు జరిగాడు. ఆ తర్వాత ఆ బాధ్యతలను స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు అప్పగించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అయితే వీరి కెప్టెన్సీ మార్పులో జట్టు కుదురు కుంటుంది అనుకుంటున్న సమయంలోనే ఇంగ్లాండ్ వైట్ బల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ నుండి తప్పుకోవడమే కాకుండా.. మొత్తం అంతర్జాతీయ క్రికెట్ నుండే తప్పుకున్నాడు.
Advertisement
అయితే 2019 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ జట్టును ఛాంపియన్ చేసిన మోర్గాన్.. ఆ తర్వాత కెప్టెన్ గా.. బ్యాటర్ గా బాగా విఫలమయ్యాడు. ఈ మధ్యే నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు… మోగ్రాన్ విఫలం అవుతుండటంతో అతను తుది జట్టులో లేకుండా పోయాడు. కాబట్టి అతని స్థానంలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఓపెనింగ్ బ్యాటర్ జొస్ బట్లర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవరించాడు. ఇక ఈ పర్యటనలో బట్లర్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు మంచి విజయాలు అందుకుంది. అయితే ఈ పర్యటన ముగిసిన తర్వాత మోర్గాన్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
Advertisement
అందువల్ల తన తర్వాతి వైట్ బల్ కెప్టెన్ గా బట్లర్ పేరును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది. ఇక పూర్తిస్థాయి ఇంగ్లాండ్ వైట్ బల్ కెప్టెన్ గా బట్లర్ మొదటి సిరీస్ లో మన ఇండియాతోనే తలబడబోతున్నాడు. ప్రస్తుతం రేపటి నుండి ఇంగ్లాండ్ భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇది ముగిసిన తర్వాత… వచ్చే నెల 7 నుండి 10 వరకు 3 టీ20లు ఆ తర్వాత 12 నుండి 17 వరకు మూడు వన్డేలలో ఈ రెండు జట్లు తలపడుతాయి. కాబట్టి ఈ రెండు సిరీస్ లే కెప్టెన్ గా బట్లర్ కు చాలా ముఖ్యం అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :