Home » కోహ్లీ సెంచరీలు కాకుండా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి…!

కోహ్లీ సెంచరీలు కాకుండా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి…!

by Azhar
Ad

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు అందరి నుండి విమర్శలు అనేవి ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. సెంచరీలు నీళ్లు తగినట్లు కొట్టే కోహ్లీ గత మూడేళ్ళుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు అంటేనే అర్ధం చేసుకోవచ్చు అతని పరిస్థితి ఎలా ఉంది అనేది. ఇక ఈ పేలవ ఫామ్ లో భాగంగానే కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ.. ఆ తర్వాత కూడా పరుగులు చేయడం లేదు. ఈ ఏడాది ఐపీఎల్ లో గోల్డెన్ డక్స్ తో విఫలమయ్యాడు. ఇక ఆ తర్వాత విశ్రాంతి తీసుకొని.. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సెంచరీ చేయాలనీ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు.

Advertisement

కానీ.. ప్రస్తుత భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాటలు మాత్రం మరోలా ఉన్నాయి. కోహ్లీ సెంచరీ చేయాల్సిన అవసరం లేదు అని ద్రావిడ్ అంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ద్రావిడ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ మాదిరి కష్టపడే క్రికెటర్ ను నేను ఇంత వరకు చూడలేదు. అతను ఎప్పుడు జట్టు కోసమే ఆలోచిస్తాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ అందరూ క్రికెటర్స్ దాటే ఓ దశను దాటుతున్నాడు. ఇది అందరికి సర్వసాధారణం. అందుకే అతనికి నేను పెద్ద స్పీచ్ యవలని అనుకోవడం లేదు.

Advertisement

ఇక అదే విధంగా… కోహ్లీ సెంచరీ చేస్తేనే సక్సెస్ అని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. నేను మాత్రం అలా అనుకోను. అతను జట్టు కోసం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి అని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు జరిగిన వార్మప్ మ్యాచ్ లో మాత్రం కోహ్లీ చాలా బాగా ఆడాడు. ఎటువంటి తొందరపాటు లేకుండా.. షాట్స్ ను చాలా చక్కగా ఎంచుకున్నాడు. కోహ్లీ లాంటి ఆటగాడు జట్టులోని మిగితా ఆటగాళ్లకు ఎప్పుడు స్ఫూర్తిని ఇస్తూ ఉంటాడు అని ద్రావిడ్ తెలిపాడు. అయితే రేపటి నుండి ప్రారంభం కానున్న టెట్ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేయాలని మాత్రం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి :

బీసీసీఐని లెక్క చెయ్యని టీం ఇండియా.. విచ్చలవిడిగా..?

టెస్ట్ కెప్టెన్ గా బుమ్రాను ప్రకటించిన బీసీసీఐ..!

Visitors Are Also Reading