Home » ద‌మ్మంటే అమ్మాయి, మాఫియా లేకుండా సినిమా తీసీ చూపించు..ఆర్జీవీకి జొన్నవిత్తుల స‌వాల్..!

ద‌మ్మంటే అమ్మాయి, మాఫియా లేకుండా సినిమా తీసీ చూపించు..ఆర్జీవీకి జొన్నవిత్తుల స‌వాల్..!

by AJAY
Ad

ప్ర‌ముఖ ప్ర‌వ‌చ‌న క‌ర్త జొన్న‌విత్తుల సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు ఆర్జీవీపై షాకింగ్ కామెంట్లు చేశారు. జొన్న‌విత్తుల ఆర్జీవీపై ఓ సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఆయ‌న మాట్లాడుతూ…క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు అనే సినిమా ఫంక్ష‌న్ కు వెళ్లిన సమ‌యంలో ఆర్జీవీతో వివాదం మొద‌లైంద‌ని జొన్న‌విత్తుల తెలిపారు. తాను ఆ సినిమా విష‌యం లో అభ్యంత‌రం చెప్పాన‌ని ప‌బ్లిసిటీ కోసం పిలిపించుకుని ఆర్జీవీ అవ‌మానించార‌ని జొన్న‌విత్తుల అన్నారు. ఆ త‌ర‌వాత మాటా మాటా పెర‌గ‌టంతో సోష‌ల్ మీడియాలో వ‌రుస ట్వీట్లు చేసి త‌న‌ను అవ‌మానించార‌ని అన్నారు.

Advertisement

rgv jonnavitthula

rgv jonnavitthula

అప్పుడే అంద‌రి పైనా సినిమాలు చేసే నీపై నేను సినిమా తీస్తా అంటూ స‌వాల్ చేసిన‌ట్టు చెప్పారు. చరిత్ర‌లో ఎంతో మంది రాక్ష‌సులు ఉన్నార‌ని వాళ్ల‌కంటే గొప్ప రాక్ష‌సులు ఇప్పుడు ఉన్న‌వాళ్లు కాద‌ని అన్నారు. ఆర్జీవీ ఈరోజు చెప్పింది రేపు కాదంటాడు. అత‌డో పిచ్చివాడ‌ని అత‌ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఎవ‌రి జీవితం వాళ్ల ఇష్ట‌మని ఒక‌రి జీవితం మ‌రొక‌రి చేతుల్లో ఉండ‌ద‌ని అదే ఆర్జీవి చెబితే గొప్ప అనుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. ఆర్జీవికి మొద‌డులో న్యూరాన్ లు దెబ్బ‌తిన్నాయ‌ని ఆరోపించారు.

Advertisement

also read : 2021లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాలు ఇవే..అందులో తెలుగు సినిమాలు ఎన్నంటే..?

అది స‌రైన మ‌న‌స్సు కాద‌ని అత‌డి చిత్త‌మే స‌రిగ్గా ఉండ‌ద‌ని అన్నారు. ఆర్జీవీ జీరో అని అలాంటి వాళ్ల‌ను చాలా మందిని చూశాన‌ని అన్నారు. ఉప్పెన ద‌ర్శ‌కుడికి ద‌మ్ముంద‌ని అన్నారు. ద‌మ్ముంటే ఆర్జీవీ ఒక పాట రాయాల‌ని ఒక క‌థ రాశి సినిమా చేయాల‌ని అన్నారు. అంతే కానీ ప‌బ్లిసిటీ కోసం ఏది ప‌డితే అది చేయకూడ‌ద‌ని అన్నారు. స్త్రీ లేకుండా మాఫియా లేకుండా దమ్ముంటే సినిమా చేయాల‌ని స‌వాల్ విసిరారు.

Visitors Are Also Reading