Home » 2021లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాలు ఇవే..అందులో తెలుగు సినిమాలు ఎన్నంటే..?

2021లో అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాలు ఇవే..అందులో తెలుగు సినిమాలు ఎన్నంటే..?

by AJAY

క‌రోనా కార‌ణంగా 2021లో త‌క్కువ సినిమాలు విడుద‌ల‌య్యాయి. అయిన‌ప్ప‌టికీ ఆ సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. న‌చ్చిన సినిమాల‌కు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురింపించారు. అలా 2021లో విడుద‌లై ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన ప‌ది సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

పుష్ప సినిమాకు మొత్తం 305 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అంతే కాకాకుండా 166.8 కోట్ల షేర్ ను పుష్ప రాబ‌ట్టింది.

అక్ష‌య్ కుమార్ హీరోగా న‌టించిన సూర్య‌వ‌న్శీ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా 291.8 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ సినిమా 143.1కోట్ల షేర్ ను రాబ‌ట్టింది.


విజ‌య్ హీరోగా న‌టించిన మాస్ట‌ర్ సినిమాకు 245.3 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ సినిమా 127.1 కోట్ల షేర్ ను రాబ‌ట్టింది.

ర‌న్వీర్ సింగ్ హీరోగా న‌టించిన 83 సినిమా 159.8 కోట్ల క‌లెక్ష‌న్లను వ‌సూలు చేసింది. ఈ సినిమాకు 73.7 కోట్ల షేర్ వ‌చ్చింది.

annatthe

ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన అన్నాత్తే సినిమాకు 154.1 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ సినిమా 80.5 కోట్ల షేర్ ను రాబ‌ట్టింది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమాకు ప్ర‌పంచ వ్యాప్తంగా 137.2 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ సినిమా 84.4 కోట్ల షేర్ ను రాబ‌ట్టింది.

Balayya

Balayya akhanda movie 

బాల‌య్య హీరోగా నటించిన అఖండ సినిమా 128 కోట్ల క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాకు 75.1 కోట్ల షేర్ వ‌చ్చింది.

శివ కార్తికేయ‌న్ హీరోగా న‌టించిన డాక్ట‌ర్ సినిమాకు 101.4 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ సినిమా 53.6 కోట్ల షేర్ ను రాబ‌ట్టింది.

Uppena

Uppena

వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన ఉప్పెన సినిమాకు 96.1 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. ఈ సినిమా 52.2 కోట్ల షేర్ ను రాబ‌ట్టింది.


శింబు హీరోగా న‌టించిన మ‌న్నాడు సినిమాకు 84.3 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ఈ సినిమా 44.1 కోట్ల షేర్ ను రాబ‌ట్టింది.

also read :  స్మోకింగ్ వ్య‌స‌నం నుండి బ‌య‌ట‌ప‌డిన మ‌న హీరోలు..!

 

Visitors Are Also Reading