Home » ప్రేమికుల రోజు సందర్భంగా ‘జియో’ బంపర్ ఆఫర్..!

ప్రేమికుల రోజు సందర్భంగా ‘జియో’ బంపర్ ఆఫర్..!

by Anji
Ad

ప్రేమికుల రోజు సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆఫర్ల వర్షం కురిపించింది. జియో వాలెంటైన్ ఆఫర్ కింద వాలెంటైన్ డే ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. ఈ ఆఫర్ కింద కంపెనీ వినియోగదారులకు ఉచిత డేటా, మెక్ డోనాల్డ్ కూపన్లతో సహా పలు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. ఈ ఆఫర్ ను పొందడానికి కూపన్ కోడ్ వివరాల కోసం మై జియో యాప్ లో కూపన్లు, విన్నింగులు క్యాబ్ ను సెలెక్ట్ చేసుకోవాలి. రూ.349, రూ.899, రూ.2,999 రీచార్జ్ పై జియో ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Advertisement

ఈ ప్లాన్ ప్రకారం ఫిబ్రవరి 10 లేదా ఆ తరువాత రీఛార్జి చేస్తే అదనపు 12GB 4G డేటా ఓపెన్ కు అర్హులు అవుతారు. రూ. 20099 ప్లాన్ తో అయినా పేర్కొన్న అన్ని ప్రయోజనాలతో పాటు కస్టమర్లు 75GB అదనపు డేటా 23 రోజుల అదనపు వాలిడిటీని కూడా పొందుతారు. జియో ఈ ఆఫర్ రూ.349, రూ.899 రెండు రీచార్జ్ ప్లాన్ లపై అందుబాటులో ఉంది. జియో ఈ ప్లాన్ లతో, వినియోగదారులు అనేక అదనపు ప్రయోజనాలతో పాటు అపరిమిత స్థానిక, జాతీయ కాలింగ్ డేటాను పొందవచ్చు. దీనిలో రూ.199కి మెక్ డొనాల్డ్ కొనుగోలు పై 12GB ఉచిత డేటాను ఉచిత McAloo Tikki ని పొందుతున్నారు. ఇది మాత్రమే కాదు.. వినియోగదారులు ఈ రీచార్జ్ తో ఫెర్న్ పెటల్స్ నుంచి షాపింగ్ చేయడం పై రూ.150 తగ్గింపును కూడా పొందుతారు. జియో రూ.349 ప్లాన్ 30 రోజుల చెల్లుబాటు ఉంటుంది. 

Advertisement

Also Read :   Valentine’s Day : భారత కెప్టెన్ రోహిత్ శర్మ లవ్ స్టోరీ గురించి మీకు తెలుసా ?

Manam News

ఇందులో వినియోగదారులు ప్రతి రోజు 2.5GB డేటాను వినియోగించుకోవచ్చు. అదనంగా ఇది అపరిమిత వాయిస్ కాల్ లతో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లను కూడా పంపించుకోవచ్చు. 90 రోజుల ప్లాన్ యొక్క పా్లన్ విషయానికి వస్తే.. జియో రూ.899 ప్లాన్ గురించి మాట్లాడితే.. వినియోగదారులు 90 రోజుల చెల్లుబాటును పొందుతారు. అపరిమిత కాల్స్ తో పాటు రోజుకు 2.5జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. అదనంగా యాడ్ ఆన్ రూ.1,000 విలువైన ప్రత్యేక తగ్గింపు వోచర్లు.. ఫెర్న్ అండ్ పెటల్స్ రూ.799 కొనుగోలు పై రూ.150 తగ్గింపు.. మెక్ డొనాల్డ్స్ రూ.199 కొనుగోలుపై రూ.105 తగ్గింపు( సౌత్ వెస్ట్ రీజియన్ మాత్రమే). ఇక్సిగో రూ.4,500 విమాన బుకింగ్ పై రూ.750 తగ్గింపు ఇలా ప్రేమికుల రోజు సందర్భంగా అనేక బంపర్ ఆఫర్లను తన వినియోగదారులకు జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

 Also Read :   “సార్” సినిమా ఫ‌స్ట్ రివ్యూ…ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading