Home » Barrelakka : బర్రెలక్క కి మద్దతుగా ప్రచారం చేయనున్న JD లక్ష్మి నారాయణ ! మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా !

Barrelakka : బర్రెలక్క కి మద్దతుగా ప్రచారం చేయనున్న JD లక్ష్మి నారాయణ ! మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా !

by Sravya
Ad

ఇప్పుడు ఎక్కడ చూసినా బర్రెలక్క పేరు బాగా వినపడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గ నుండి స్వతంత్ర అభ్యర్థిగా శిరీష అలియాస్ బర్రెలక్క బరిలోకి దిగింది రోజు రోజుకి ఆమెకి సపోర్ట్ కూడా వస్తోంది. తాజాగా జె.డి లక్ష్మీనారాయణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి సపోర్ట్ ఇచ్చారు. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ని గెలిపించి భారత రాజ్యాంగానికి వన్నె తీసుకురావాలని జెడి లక్ష్మీ నారాయణ చెప్పారు ప్రధాన పార్టీలు ఉత్తమ అభ్యర్థుల్ని పక్కకు తప్పించి బర్రెలక్కకి సపోర్ట్ గా నిలవాలన్నారు మంగళగిరిలో ఆదివారం ఓ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవం లో లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది.

Advertisement

Advertisement

ఎన్నికల్లో డబ్బున్న వారు కాదు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న సామాన్య యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు. అందుకనే బర్రెల కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులతో బర్రెలక విజయానికి కృషి చేయాలని జెడి లక్ష్మీనారాయణ చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజక వర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన కర్నే శిరీష అలియాస్ బర్రెలక్కకి అన్ని వర్గాల నుండి కూడా సపోర్ట్ అయితే ఉంది.

జెడి వివి లక్ష్మీ నారాయణ కూడా ఆమె కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. నరసింహారావు ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు. మా రక్ష బర్రెలక్కకి మద్దతు ప్రకటిస్తోందని పోస్ట్ లో అయిన వెల్లడించారు. ఎన్నోసార్లు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగం రాలేదని నాలుగు బర్రెలు కొనుక్కుని కాస్తున్నానని రాష్ట్రంలోని నిరుద్యోగులు సమస్యల గురించి చెప్తూ ఒక రీల్ చేసింది శిరీష. 30 సెకండ్ల ఉన్న ఆ రీల్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది బర్రెలక్కగా ఫేమస్ అయిపోయింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading