టాలీవుడ్ కు ఏమైంది…వరుస విడాకుల వార్తలు వినిపిస్తున్నాయేంటి. అనుకునేవారికి మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఇండస్ట్రీలో మరో నటుడు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్జివి శిష్యుడిగా హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జెడి చక్రవర్తి త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జెడీ చక్రవర్తి టాలీవుడ్ లో హీరోగా నటించారు. ఆ తర్వాత ముంబైకి వెళ్లి అక్కడే కొంతకాలం బాలీవుడ్ సినిమాల్లో మెరిసారు.
Advertisement
ALSO READ : ఎన్టీఆర్ కృష్ణ మధ్య గొడవలపై ఆసక్తికర కామెంట్లు చేసిన మహేశ్..!
jd chakravarthy
కానీ ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరమయ్యారు. జోష్ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో జె.డి.చక్రవర్తి తళుక్కుమన్నారు. ఈ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. అయినప్పటికీ తెలుగులో కూడా జె.డి.చక్రవర్తికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇక లేటు వయసులోనే జె.డి.చక్రవర్తి అనుకృతి గోవింద్ శర్మ అనే హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నారు. ఈమె వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీదేవి సినిమాలో హీరోయిన్ గా నటించింది. పెళ్లి తరవాత ముంబైలోనే కాపురం పెట్టారు.
Advertisement
jd chakravarthy anukriti govind sharma
కొంతకాలం సజావుగానే వీరి వైవాహిక జీవితం సాగినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఇప్పుడు విడిపోవాలని అనుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ అధికారికంగా విడాకులు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీలో జె.డి.చక్రవర్తి కనిపించిన సంగతి తెలిసిందే. దాంతో జె డి చక్రవర్తి తెలుగు లో మరోసారి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.