ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల ధరలపై ఇంకా స్పష్టత నెలకొనలేదు. దీంతో తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్నా సినిమాలపై భారం పడే అవకాశముంది. అయితే ఫిబ్రవరి 25పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ఏపీలో జీవో 35 ప్రకారం..సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సినిమాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసారు. అయినా ఆయనకు ఏమి కాదని ఆయన చెప్పారు.
Advertisement
Advertisement
ఈగో నీకు ఒక్కడికే కాదు అందరికీ ఉంది. పవన్ కల్యాణ్ కు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కేసుల్లో ఇరికించావ్.. ఏమి చేశావు.. నువ్వు ఏమి చేయలేవని మండిపడ్డారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. చిరంజీవి చేతులు జోడించి అడిగారు. ఆయన బతక లేక నీ దగ్గరకు రాలేదు. సినిమా పరిశ్రమ కోసం వచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి ఏ హీరో, డైరెక్టర్ రాష్ట్రంలో సినిమా తీయరని, సినిమా టికెట్ల ధరల తగ్గింపునకు మేము వ్యతిరేకం కాదు. కానీ ముందే చెప్పాలి కదా అని ఆయన అన్నారు. అదే ఎవడబ్బా సొమ్ము అని తిరుమలలో టికెట్ల ధరలు పెంచుతున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Also Read : భీమ్లానాయక్ పై ఆర్జీవీ సెటైర్లు…పవన్ కు సపోర్ట్ గా పూనమ్ కౌర్…!