Home » వాళ్ళ కుక్కలకు కూడా హోటల్ రూములు కానీ….టాలీవుడ్ పై జయసుధ సంచలన వ్యాఖ్యలు…!

వాళ్ళ కుక్కలకు కూడా హోటల్ రూములు కానీ….టాలీవుడ్ పై జయసుధ సంచలన వ్యాఖ్యలు…!

by AJAY
Ad

టాలీవుడ్ లో స‌హ‌జ‌నటిగా గుర్తింపు తెచ్చుకున్న జ‌య‌సుధ గ‌త కొద్దినెల‌లుగా సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. కాగా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో జ‌య‌సుధ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న యాభై ఏళ్ల సినిమా ప్రస్థానంలో ఎదురైన అనుభ‌వాల‌ని ఇంట‌ర్వ్యూలో పంచుకుంటూనే టాలీవుడ్ పై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు క‌నిపించింది.

Advertisement

హీరోల‌కు స‌మానంగా హీరోయిన్ ల‌ను చూడ‌ర‌ని వివ‌క్ష చూపుతార‌ని జ‌య‌సుధ ఆరోపించింది. అంతే కాకుండా ముంబై నుండి వ‌చ్చే హీరోయ‌న్ లు అంటే మోజ‌ని వారి కుక్క‌ల‌కు కూడా స్పెష‌ల్ రూమ్ లు కేటాయిస్తార‌ని కామెంట్స్ చేసింది. హీరోల‌కు డ్యాన్స్ రాక‌పోయినా కూడా హీరోయిన్ ల‌ను ప‌క్క‌కు పిలిచి సరిగా డ్యాన్స్ చేయండి అని చెప్పిన సంధ‌ర్బాలు కూడా ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది.

Advertisement

 

Jayasudha

హీరోలు ఎప్పుడూ కూడా డామినేట్ చేయ‌రని కానీ వారి ప‌క్క‌న ఉండేవాళ్లు డామినేట్ చేస్తార‌ని పేర్కొంది. ఇక శోభ‌న్ బాబు తో త‌న‌కు ఉన్న అనుబంధం గురించి చెబుతూ…త‌న‌ను శోభ‌న్ బాబు ఏమోయ్ అని పిలిచేవాడ‌ని తెలిపింది. డ‌బ్బులు ఎలా జాగ్ర‌త్త‌గా దాచుకోవాలో ఆయ‌న వ‌ద్ద తెలుసుకుని ఉంటే బాగుండేద‌ని తెలిపింది. నేను ఒక మంచి స్థ‌లం చూపిస్తాను మీ నాన్నకు చెప్పి కొనుక్కో అంటూ స‌ల‌హాలు ఇచ్చేవార‌ని చెప్పింది.

ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి యాభై ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఒక్క‌రు కూడా త‌న‌కు అభినంద‌న‌లు తెల‌ప‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అదే బాలీవుడ్ అయితే ఒకే బొకే అయినా ఇచ్చుండేవార‌ని ఇక్క‌డ అది కూడా లేద‌ని చెప్పింది. కానీ హీరో యాభై ఏళ్లు పూర్తిచేసుంటే పండ‌గ‌లా జ‌రుపుకుంటారని చెప్పింది. మా ఎల‌క్ష‌న్ గురించి తెలిసి ఆ గోల ఎందుక‌ని మ‌రో నెల రోజులు అమెరికాలోనే ఉండిపోయానని తెలిపింది. మా బిల్డింగ్ ముర‌ళీ మోహ‌న్ అధ్య‌క్షుడుగా ఉన్న‌ప్పుడు క‌డ‌తాన‌ని చెప్పార‌ని అది ఇంకో ఇర‌వై ఏళ్లు అయినా అవుతుందో లేదో అంటూ కామెంట్స్ చేసింది.

ALSO READ : ప‌వ‌న్, మ‌హేశ్ స‌హా 12మంది స్టార్స్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో సౌత్ ఇండియా స్టార్ గా ఎదిగిన సూర్య‌..ఆ సినిమా ఏంటంటే..?

Visitors Are Also Reading