Home » మోహన్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలో ఆఫర్ వచ్చినా ఆ ఒక్క కారణం తో రిజెక్ట్ చేసిన జయసుధ..ఆ కారణం ఏంటంటే..?

మోహన్ బాబు బ్లాక్ బస్టర్ సినిమాలో ఆఫర్ వచ్చినా ఆ ఒక్క కారణం తో రిజెక్ట్ చేసిన జయసుధ..ఆ కారణం ఏంటంటే..?

by AJAY
Ad

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో మోహన్ బాబు నటించినప్పటికీ ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా పెదరాయుడు. ఫ్లాపులతో సతమవుతున్న సమయంలో రజనీకాంత్ సలహాతో మోహన్ బాబు పెదరాయుడు సినిమాలో నటించాడు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది.

Advertisement

ఈ చిత్రంలో రజనీకాంత్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మోహన్ బాబు రజనీకాంత్ తనకు పెదరాయుడు లాంటి సినిమా ఇచ్చి నిలబెట్టాడని చెప్పుకుంటారు. ఈ సినిమాలో మోహన్ బాబు డబల్ యాక్షన్ చేశారు. ఇక హీరోయిన్లుగా సౌందర్య, భానుప్రియలు నటించారు.

Advertisement

అయితే నిజానికి ఈ సినిమాలో నటించే అవకాశం మొదటగా సహజ నటి జయసుధ వద్దకు వచ్చిందట. అప్పటికే జయసుధ మోహన్ బాబు కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దాంతో వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అంటూ ముద్ర పడిపోయింది.

అయితే తాను పెదరాయుడు సినిమాను రిజెక్ట్ చేసినట్టు జయసుధ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం తనకు వచ్చిందని కానీ సినిమాలో మోహన్ బాబుతో డ్యూయెట్ ఉండడం వల్ల తాను ఈ సినిమాను రిజెక్ట్ చేశానని చెప్పింది.

Visitors Are Also Reading