Home » జాన్వీక‌పూర్ తెలుగులో ఏ హీరోతో చేయ‌నుందో తెలుసా..?

జాన్వీక‌పూర్ తెలుగులో ఏ హీరోతో చేయ‌నుందో తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

అందాల తార శ్రీ‌దేవి గారాల ప‌ట్టి జాన్వీక‌పూర్ ఇటీవ‌లే సెన్షేష‌న్ గా మారిన విష‌యం తెలిసిందే. ధ‌డ‌క్ సినిమాతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ అద్భుత‌మైన న‌ట‌న‌తో హైలెట్‌గా నిలిచింది. తొలి చిత్రంలోనే సీనియ‌ర్ న‌టి మాదిరిగా హావ‌భావాలు ప‌లికించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఫ‌లితంగా బాలీవుడ్‌లో జాన్వీక‌పూర్ గ్రాండ్ ఎంట్రీని ద‌క్కించుకోవ‌డంతో పాటు దేశవ్యాప్తంగా పాపుల‌ర్ అయిపోయింది. ఆమె అందం గురించి ఇంట‌ర్నెట్ అభిమానులంద‌రికీ ప‌రిచ‌య‌మే.

janhvi kapoor

janhvi kapoor

 

ఆమె అందంతో త‌డిసి ముద్ద‌యిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ దక్షిణాదిలో ఎంట్రీపై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. మాకు ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మంటే ఎంతో అభిమాన‌మ‌ని.. ఇక్క‌డి సినిమాల్లో న‌టించ‌డం ద్వారానే శ్రీ‌దేవి ఆలిండియా లేడీస్టార్‌గా ఎదిగింద‌ని బోనీ క‌పూర్ ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించారు. అదేవిధంగా మంచి క‌థ దొరికితే తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళ భాష‌ల్లో త‌ప్ప‌కుండా న‌టిస్తుంద‌ని కూడా వెల్లడించారు. మొత్తానికి జాన్వీక‌పూర్ సౌత్ ఇండ‌స్ట్రీపై ఉన్న అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేశారు.

Advertisement

Advertisement

త్వ‌ర‌లో జాన్వీక‌పూర్ ఎన్టీఆర్ 31వ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానున్న‌ద‌ని పేర్కొంటున్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ముందు దీపిక‌ను అనుకున్నా ఆ త‌రువాత జాన్వీ అయితే బాగుంటుంద‌ని ఆమెను సంప్ర‌దించార‌ట‌. అందుకు ఆమె ఓకే చెప్ప‌డంతో ఇక ఈ చిత్రంలో క‌థానాయిక జాన్వీనే అంటున్నారు. జాన్వీక‌పూర్ సౌత్ హీరోల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన విష‌యం విధిత‌మే. ఇంత‌కు ముందే జాన్వీ తెలుగులో న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వినిపించాయి. కానీ అవి వాస్త‌వం కాలేదు. మ‌రీ ఎన్టీఆర్‌తో తెలుగులో ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది ఎదురుచూడాలి.

Also Read : 

చిరంజీవి పెళ్లి జ‌రిగిన కొత్త‌లో దర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ట్రైన్‌లో ఏం చేశాడో మీకు తెలుసా..?

స్టార్ కాకపోయుంటే ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టేదా..? ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం..ఏంటంటే..?

Visitors Are Also Reading