Home » ఝాన్సీ కి రాణి సీరియ‌ల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

ఝాన్సీ కి రాణి సీరియ‌ల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా న‌టించిన‌వాళ్లు ప్ర‌స్తుతం న‌టీన‌టులుగా రానిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు న‌టీన‌టులుగా ఎంట్రీ ఇచ్చి ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే కొంత‌మంది స‌క్సెస్ అయితే మ‌రికొంద‌రు ఇప్పుడిప్పుడే అవ‌కాశాల కోసం వెతుక్కుంటున్నారు. ఇక ఒక‌ప్పుడు జాన్సీ కీ రాణి అనే హిందీ సీరియ‌ల్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది.

Advertisement

హిందీలో వ‌చ్చిన ఈ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ ను తెలుగులోనూ ఝాన్సీ రాణి ల‌క్ష్మీబాయి పేరుతో డ‌బ్ చేశారు. ఈ సీరియ‌ల్ లో చిన్న‌నాటి ఝాన్సీరాణి గా న‌టించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు గ‌గ‌న్ గుప్తా. ఈమె తండ్రి కూడా ఒక న‌టుడే కాగా చిన్న త‌నం నుండి సినిమాలు చూస్తూ పెరిగింది. దాంతో ఇక జాన్సీరాణి సీరియ‌ల్ లో పాత్రకోసం చిన్న‌వ‌య‌సులోనే గుర్ర‌పుస్వారి మ‌రియు యుద్ద‌క్రీడ‌లు సైతం నేర్చుకుంది.

Advertisement

సీరియ‌ల్ సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక గ‌గ‌న్ గుప్తా పుట్టింది పెరిగింది అంతా ముంబై లో అయినా ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా అవ‌కాశాల‌ను అందుకుంటోంది. రీసెంగ్ తెలుగులో మాడ్ర‌న్ ల‌వ్స్ ఆఫ్ హైద‌రాబాద్ అనే వెబ్ సిరీస్ విడుద‌లైంది.

ఈ వెబ్ సిరీస్ లో సుహాసిని, నిత్యామీన‌న్, రీతూ వ‌ర్మ‌, అభిజిత్ ముక్య‌పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఇదే వెబ్ సిరీస్ లో గ‌గ‌న్ గుప్తా కూడా న‌టించి ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా ఇప్ప‌టికే తెలుగులో ఆంధ్రాపోరీ అనే సినిమాలోనూ నటించి ఆక‌ట్టుకుంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన గ‌గ‌న్ గుప్తా ముందు ముందు ఎలాంటి అవ‌కాశాలు అందుకుంటుందో చూడాలి.

Visitors Are Also Reading