Home » ప్రియుడితో మరోసారి …అడ్డంగా దొరికిపోయిన ‘జాన్వి’…!

ప్రియుడితో మరోసారి …అడ్డంగా దొరికిపోయిన ‘జాన్వి’…!

by Bunty
Ad

 

జాన్వి కపూర్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని అనుకుంది. తల్లికి తగ్గ కూతురిలా ఇండస్ట్రీలో చక్రం తిప్పాలి అనుకుంది. కానీ ఈ అమ్మడిని ఎవరు పెద్దగా ఆదరించలేదు. మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కకపోవడంతో ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు మళ్ళింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనైనా దేవర సినిమాతో మంచి హిట్ కొట్టి శ్రీదేవి అంత పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

ఇక జాన్వి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. ఈ క్రమంలోనే తాజాగా జాన్వి కాఫీ విత్ కరన్ షోకి వెళ్ళింది. ఇందులో తన చెల్లెలితో కలిసి పార్టిసిపేట్ చేసింది. ఈ షోలో అక్క చెల్లెలు కలిసి షోని మరింత అందంగా మార్చారు. ఈ షోలో భాగంగా కరణ్, జాన్విని నీ ఫోన్ లో ఉన్న స్పీడ్ డయల్ నెంబర్స్ లో ముగ్గురి పేర్లు చెప్పు అని అడగ్గా టక్కున జాన్వి…. పప్పా, ఖుషి, శిక్కు అని చెప్పేసింది. దీంతో శాన్వి, శికర్ పహారియాతో ప్రేమలో ఉందని క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరి ప్రేమ ఇప్పటికే కాదు. శ్రీదేవి ఉన్నప్పటి నుంచే జాన్వి కపూర్, శిఖర్ పహారియా మధ్య ప్రేమాయణం నడుస్తోంది. వీరిద్దరూ ఎప్పుడు బయటకు వెళ్లినా కలిసే వెళ్తారు. అంతేకాకుండా గుడిలు, గోపురాలు అంటూ ఇద్దరూ కలిసి జంటగా వెళ్తారు.

ఆ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహంకాళేశ్వర టెంపుల్ లో ఇద్దరు కలిసి పూజలో పాల్గొని భజన కూడా చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ కూడా చేస్తున్నారని ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కారులో చాలాసార్లు కెమెరా కంటపడ్డారు. ఈ వార్తలపై ఎన్నో రకాలుగా కామెంట్స్ వచ్చినప్పటికీ జాన్వి ఇంతవరకు నోరు విప్పలేదు. ఇక వీరిద్దరూ త్వరలోనే కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఇంతవరకు నిజం ఉందో తెలియాలంటే వారు చెప్పేవరకు వేచి చూడాల్సిందే.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

 

Visitors Are Also Reading