Home » జక్కన్న ఆ వ్యక్తిని కొట్టించాలనుకున్నారట.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

జక్కన్న ఆ వ్యక్తిని కొట్టించాలనుకున్నారట.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే దిగ్గజ డైరెక్టర్ గా పేరు ఉంది రాజమౌళి కి.ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ దర్శకుడిగా మారారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయిలో తెలుగు ఇండస్ట్రీ పేరును మారుమోగేలా చేశారు. అలాంటి రాజమౌళి ఒక వ్యక్తిని బాగా కొట్టాలనుకున్నారట.. మరి ఆ వ్యక్తి ఎవరు..ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.. చిన్నతనంలో బాగా డబ్బు సంపాదించి ఆ వ్యక్తిని కొట్టించాలని భావించారట రాజమౌళి.ఈ విషయాన్ని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. రాజమౌళి కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కొవ్వూరు ప్రాంతానికి చెందినవారు.

also read:9 ఏళ్లుగా శ్రీహాన్ తో ప్రేమాయ‌ణం…పెళ్లి అప్పుడే అంటూ క్లారిటీ ఇచ్చిన బ్యూటీ..!

Advertisement

 

also read:Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఓ శుభవార్త వింటారు..!

Advertisement

తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సినిమాల మీద ఆసక్తితో రచయితగా మారాలని మద్రాసు వెళ్లారు. ఆయన మద్రాస్ కి వెళ్ళిన తర్వాత అవకాశాలు ఈజీగా అయితే రాలేదు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఘోస్ట్ రైటర్ గా పని చేసే అవకాశం దక్కింది. అప్పట్లో ఘోస్ట్ రైటర్లకు డబ్బులు ఎప్పుడు వస్తాయో, అసలు రావో కూడా తెలియవు. దాదాపు 17,18 మంది కీరవాణి సంపాదన మీదే బ్రతికేవారని రాజమౌళి తెలియజేశారు. కీరవాణి సంగీత దర్శకుడు చక్రవాణి దగ్గర అసిస్టెంట్ గా చేసేవారు. అక్కడ వచ్చిన డబ్బులతోనే ఈ కుటుంబమంతా గడిసేదట.

తన తండ్రి ఘోస్ట్ రైటర్ రెమ్యూనరేషన్ డబ్బులు వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న పచారి కొట్టు కూరగాయల షాపు వాళ్ల దగ్గర తెచ్చుకున్న సామాన్లకు డబ్బులు ఇచ్చేవారట. అయితే ఒక సమయంలో రాజమౌళి కూరగాయల వ్యాపారి దగ్గరికి వెళ్లి ఒక కేజీ టమాటలు ఇవ్వమని అడిగితే ఆయన కాసేపు ఆగురా అని రాజమౌళి పై కసురుకున్నారట. దీన్ని అవమానంగా భావించిన జక్కన్న, ఎప్పటికైనా తాను డబ్బులు బాగా సంపాదించి ఆ షాప్ అతన్ని కొట్టించాలని భావించారట. ఈ విషయాన్ని ఆయన ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటే నవ్వు వస్తుందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆయన చెప్పిన ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:

Visitors Are Also Reading