జైలర్ సినిమా ఆగష్టు పదవ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ పోషించగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణన్, మర్నామీనన్, వసంత్ రవి, విజయకన్, వీటీవీ గణేష్, యోగి బాబు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ మరియు జాకీ శ్రాఫ్ లు కీలక పాత్రలు పోషించారు. ఇంత మంది పాపులర్ నటులు ఉన్నప్పటికీ.. ఈ సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తికి చాలా పాపులారిటీ వచ్చింది. ఆయన తన నటనా ప్రతిభతో ఆకట్టుకోవడంతో ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
Advertisement
సాధారణంగా స్టార్ హీరోలు ఉన్న సినిమాలలో ఒక విలన్ కి పేరు రావాలి అంటే అది చాలా కష్టం. అయితే.. రజిని లాంటి స్టార్ ఉన్న సినిమాలో నటించిన ఓ విలన్ కి ఇప్పుడు మంచి పేరు వచ్చింది. అయితే దాని వెనుక ఆయన ఎంత కష్టపడ్డారో మనం ఊహించవచ్చు. సినిమాలో సుత్తితో మొహం పగలగొట్టి చంపేసి.. కళ్ళతోనే ఆడియన్స్ ని కూడా భయపెట్టేసిన దేశవాళీ విలన్ అసలు పేరు వినాయకన్. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు. గాయకుడూ, స్వర కర్త, నాట్యాచారుడు కూడా.
Advertisement
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ నటుడికి జైలర్ సినిమాలో విలన్ పాత్రకి గాను ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా? అంటూ నెట్టింట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆయనకు 35 లక్షల పారితోషికం మాత్రమే ఇచ్చారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదు అంటూ ఆ నటుడు స్పందించారు. నిర్మాత నేను అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చారని.. రాయల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారని వినాయకన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఛాన్స్ రావడం అనేది చాలా పెద్ద విషయం అని.. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉన్నానని వినాయకన్ చెప్పుకొచ్చారు.
మరిన్ని..
ఒకప్పటి స్టార్ హీరో వేణు తొట్టెంపూడి ఈ బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారా? ఒకవేళ చేసి ఉంటె?
ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు..MP గా పోటీ చేస్తారా ?