Home » జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..లేటెస్ట్ 10 ఫోటోలు చూస్తే కళ్ళు తిప్పుకోలేరు..?

జై చిరంజీవ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..లేటెస్ట్ 10 ఫోటోలు చూస్తే కళ్ళు తిప్పుకోలేరు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవికి మేనకోడలిగా నటించిన చిన్న పాప మీకు గుర్తుందా..? ఆ అమ్మాయి పేరు శ్రియా శర్మ. ముద్దు ముద్దు నటనతో క్యూట్ లుక్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ పాప జై చిరంజీవ సినిమాలో చాలా బాగా నటించింది. ఈ అమ్మాయి స్వస్థలం హిమాచల్ ప్రదేశ్ లోని పాలమూర్ ప్రాంతం. మూడేళ్ల వయసు నుండే బాల నటిగా చాలా సినిమాaల్లో నటించింది. అలాగే శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈమె బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. శ్రీయ తండ్రిగా ఇంజనీర్ గా పని చేస్తున్నారు. శ్రియా నటనలోనే కాకుండా చదువులో కూడా ముందు ఉంది. శ్రీయా కి సినిమాలంటే అమితమైన ఇష్టం.2001 నుండి నటిస్తున్న శ్రియా మొదటగా హిందీలో నటించింది. 2005 లో తెలుగులో జై చిరంజీవ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ్,హిందీ, మలయాళం, కన్నడ సినిమాల్లో మొత్తం కలిపి 20 సినిమాలకు పైగా నటించింది. తెలుగులో రోబో, తూనిగ తూనీగ, దూకుడు, జై చిరంజీవ, రచ్చ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరినీ మెప్పించింది.

Advertisement

Advertisement

సినిమాలే కాకుండా బుల్లితెరపై కూడా తన హవాను చూపించింది. హిందీ లో కసోటి జిందగీ క్యా అనే టీవీ షోలో నటించి 2005 లో ఉత్తమ బాలనటిగా స్టార్ పురస్కారం అందుకుంది. ఇండియన్ అకాడమీ అవార్డు 2004 లో వచ్చింది. ఈ అమ్మడు ఇప్పుడు యూత్ మతులను పోగొడుతోంది. శ్రియా తన అద్భుత నటనతో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. ఆమె బాలీవుడ్ లో మంచి హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. తన కెరియర్ లో తాను ఉన్నత స్థాయికి ఎదగాలని మనం కూడా కోరుకుందాం.

1/10

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

also read;

ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఝలక్ ఇచ్చిన ఫ్లిప్ కార్ట్.! బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఏముందంటే ?

మీ పిల్లలు శనివారం పుట్టారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

 

 

Visitors Are Also Reading