Home » మీ పిల్లలు శనివారం పుట్టారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

మీ పిల్లలు శనివారం పుట్టారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

శనివారం రోజు పుట్టిన పిల్లలు మిగతా వారి కంటే కాస్త భిన్నంగా ఉంటారట. ఇందుకు ఒక కారణమే ఉంది. అయితే ఆస్ట్రాలజీ ప్రకారం మనుషుల స్వభావాలు వ్యక్తిత్వాలు భిన్నంగా ఉంటాయి. దీనికి కారణం అతని రాశి, పుట్టిన రోజు. శనివారం అంటే శని దేవున్ని పూజి స్తారు. అది శనిదేవుని రోజు. అందుకే శనివారం రోజు పుట్టిన పిల్లలపై శనిదేవుని ప్రభావం జీవితాంతం కనిపిస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం శనివారం రోజు పుట్టిన పిల్లలపై శని గ్రహ ప్రభావం ఉంటుంది.

చిన్న వయసులోనే వీరికి చాలా కష్టాలు ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కొంటే జీవితంలో గొప్ప స్థాయిలో ఉంటారు. అలాగే ఎక్కువమందితో కలిసేందుకు ఇష్ట పడరు. చిన్న చిన్న విషయాలకే కోప్పడతారట. ఎవరైనా అవమానిస్తే జీవితాంతం మర్చిపోరు. శనివారం పుట్టిన పిల్లలు చాలా స్లోగా నడుస్తారు అలాగే వీళ్ళు మంచి వారిని చెడ్డ వారిగానూ, చెడ్డ వారిని మంచి వారి గాను అనుకుంటారట. అయితే వీళ్లకు చాలా కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది.

Advertisement

Advertisement

ఎంత కష్టం వచ్చినా వెనుకడుగు వేయరు. కానీ ఎంత కష్టపడినా సరైన గౌరవం పొందలేరు. తలరాత ఎలా ఉన్నా కూడా కష్టపడి అదృష్టాన్ని మార్చుకుంటారట. ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు పట్టువీడరట. అలాగే శనివారం పుట్టిన వారి లక్ష్యాలు కూడా చాలా గొప్పగా ఉంటాయట. అందుకే కోరుకున్నవి కష్టపడి సాధించుకుంటారని ఆస్ట్రాలజీ చెబుతోంది.

also read;

సితార సంద‌డి మామూలుగా లేదుగా.. ఆమెకు ఈ టాలెంట్ కూడా ఉందా..? ప‌లువురు కామెంట్స్

ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఝలక్ ఇచ్చిన ఫ్లిప్ కార్ట్.! బాక్స్ ఓపెన్ చేసి చూడగా అందులో ఏముందంటే ?

 

Visitors Are Also Reading