తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఓ దశలో రాజీనామాకు సిద్ధపడ్డారు. సోనియా, రాహుల్ గాంధీకి లేఖ రాసి.. ఇక నేను కాంగ్రెస్ గుంపులో లేనట్టే అని పేర్కొన్నారు. ఎంతమంది సముదాయించినా కానీ వెనుకడుగు వేసినట్టు కనిపించలేదు. కానీ రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం తరువాత మనస్సు మార్చుకుని రాజీనామా లేఖను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు.
Advertisement
ఇవాళ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసిన జగ్గారెడ్డి.. ఇకపై బహిరంగ విమర్శలుండవు. మీరు కూడా చూడరని వెల్లడించారు. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవని చెప్పారు. నా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్‌గాంధీని ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నాను. అది ఈరోజు కుదిరిందని వెల్లడించారు. రాజకీయాల కంటే ముందు మా పిల్లల చదువుల గురించి అడిగారని తెలిపారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలతో రాజకీయం చేస్తున్నా.. టీఆర్ఎస్ తో పాటు మొత్తం మూడు పార్టీలకు వ్యతిరేకంగా పని చేస్తాం అని జగ్గారెడ్డి వెల్లడించారు.
Advertisement
Also Read : బంగారాన్ని క్రాస్ చేసిన ఎర్ర బంగారం.. ఎనుమామూల మార్కెట్‌లో ధర ఎంతంటే..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలిసి కట్టుగా పని చేసి.. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామన్న ఆయన సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు వెళ్తామన్నారు. రాహుల్ గాంధీ ముందు ఏ అంశాన్ని ఎత్తలేదు. ఇప్పటివరకు జరిగిన అన్ని మరిచిపోయానని స్పష్టం చేశారు. మొన్నటి సమావేశంలో ఇచ్చిన సందేశం మేరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. మనం, మన కుటుంబమంటే.. ప్రజలు, దేశం అన్నట్టుగా మేమంతా కలిసి కట్టుగా పని చేస్తామని బహిరంగ విమర్శలు ఇకపై ఉండవు. పార్టీలో అసలు ఇప్పుడు సమస్యలే లేవన్నారు జగ్గారెడ్డి. మరొక వైపు కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్ తో కూడా పార్టీ అంశాల గురించి చర్చించినట్టు జగ్గారెడ్డి తెలిపారు.
Also Read : పది మంది భార్యలు కావాలి.. ఆ కోరిక నెరవేరాలి..!