Home » ప‌ది మంది భార్య‌లు కావాలి.. ఆ కోరిక నెరవేరాలి..!

ప‌ది మంది భార్య‌లు కావాలి.. ఆ కోరిక నెరవేరాలి..!

by Anji
Ad

ఒక్కోక్క‌రికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కొంత మందికి సినిమా పిచ్చి.. మ‌రికొంద‌రికి డ‌బ్బు పిచ్చి.. మ‌రికొంద‌రికీ అమ్మాయిల పిచ్చి.. ఇలా ఎవరికీ ఏదీ న‌చ్చితే దాని పిచ్చి ఎక్కువ‌గా ఉంటుంది. ఇక్క‌డ మాత్రం ఓ మోడ‌ల్‌కు భార్య‌ల పిచ్చి ఎక్కువ‌గా ఉంది. సాధార‌ణంగా ఎవ‌రైనా ఒక భార్య‌తోనే ఉండ‌లేక త‌రుచూ వాదోప‌వాదాలు న‌డుస్తున్న ఈ త‌రుణంలో ఇతను మాత్రం ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ఏకంగా 9 మందిని పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

అది కూడా ఆ 9 మంది అంగీకారంతోనే.. వీడు ఎవ‌డండీ బాబు అని అనుకుంటున్నారా..? ఎవ‌రో కాదు బ్రెజిల్‌కు చెందిన మోడ‌ల్ ఆర్థ‌ర్ ఓ ఉర్సో గ‌త కొన్ని రోజుల క్రితం ఈ పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగిపోయిన‌ది. ఎందుకంటే తాను చేసుకున్న 9 మంది భార్య‌ల‌తో క‌లిసి అత‌ను సెల్ఫీ తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్ష‌ణాల్లోనే అది వైర‌ల‌వ్వ‌డం.. దీంతో అత‌ను ఫేమ‌స్ అయిపోయాడు.

Advertisement

Also Read :  గ్రూప్‌-1, 2 అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఉచిత శిక్ష‌ణ‌తో పాటు స్టైఫండ్‌

తాజాగా మ‌రొక‌సారి ఆర్థ‌ర్ వార్త‌ల్లో నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు 9 మంది భార్య‌ల‌తో అన్యోన్యంగా ఉన్న అత‌నికి ఓ భార్య షాక్ ఇచ్చింది. ఉర్సో నుంచి విడాకులు కోరింద‌ట‌. ఆమె ఏక‌స్వామ్య సంబంధాన్ని కోరుకుంటుంద‌ని.. త‌న‌కు అలాంటి ఉద్దేశం లేక‌పోవ‌డంతో ఆమెకు విడాకులు ఇచ్చాన‌ని చెప్పి మ‌రొక సారి షాక్ ఇచ్చాడు. అందేకాదు.. త‌న జీవితంలో 10 మంది భార్య‌లు ఉండాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పాడు. త్వ‌ర‌లోనే మ‌రొక రెండు పెళ్లిళ్లు చేసుకుని ఆ కోరిక తీర్చుకుంటాన‌ని చెప్పాడు. సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

Also Read :  ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ భార్య ప్ర‌ముక టాలీవుడ్ న‌టి అన్న సంగ‌తి తెలుసా..? ఎవ‌రంటే..!!

Visitors Are Also Reading