మ్యాచో మ్యాన్ గోపిచంద్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా గోపించంద్ సీటీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఇక గోపిచంద్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రలో రాజశేఖర్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే కొన్నికారణాల వల్ల రాజశేఖర్ ఈ సినిమా నుండి తప్పుకోగా ఆయన ప్లేస్ లో జగపతి బాబును తీసుకున్నారు.
Advertisement
అంతే కాకుండా జగపతి బాబు పుట్టిన రోజు సంధర్బంగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా ఈ యేడాది జగపతి బాబు క్రేజీ సినిమాలలో నటించారు. వరుణ్ తేజ్ గని సినిమాలో జగపతిబాబు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా ప్రభాస్ సలార్ సినిమాలో మరియు రాధేశ్యామ్ సినిమాలోనూ జగపతి బాబు ఉన్నారు. అంతే కాకుండా శ్రీవాస్ గోపిచంద్ కాంబోలో వచ్చిన లక్ష్యం, సాక్ష్యం సినిమాలలో కూడా జగపతి బాబు ఉన్నాడు.
Advertisement