హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పటి నిర్మాత, దర్శకుడు రాజేంద్రప్రసాద్ కుమారుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి జగపతిబాబు ఎంట్రీ ఇచ్చాడు. అలా తన కెరియర్ ప్రారంభం నుంచి సైడ్ హీరో క్యారెక్టర్ నుంచి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటించడంలో జగపతిబాబు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు.
ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో జగపతిబాబు క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గిపోయింది. తాను ఆశించినంత స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. దీంతో లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఆ సినిమాతో జగపతిబాబు విలన్ గా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా జగపతిబాబు తన సత్తా చాటుకున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన పెద్ద మిస్టేక్ గురించి వెల్లడించారు.
Advertisement
Advertisement
నేను కెరియర్ లో సరిగ్గా ఉన్నట్లయితే ఇప్పటికీ 1000 కోట్ల ఆస్తిని సంపాదించేవాడిని. ఇతరుల మాయమాటల వల్ల, అతి నమ్మకం వల్ల నేను చాలా డబ్బును కోల్పోయాను. నేను చేసిన అతి నిర్లక్ష్యం వల్లనే చాలా కోల్పోవాల్సి వచ్చింది. జీవితంలో నాకు డబ్బు మీద అంతగా ఆసక్తి లేదు. మనం బతకడానికి నాకు ఒక 30 కోట్ల ఆస్తి ఉంటే చాలనిపించింది. ఇప్పుడు నేను దాన్ని సంపాదించుకున్నాను. ఇకపై వచ్చే డబ్బు ఏదైనా కేవలం అది నాకు బోనస్ గా మాత్రమే వస్తుంది. డబ్బు రావాలని నేను ఎప్పుడూ ఆశించలేదు. వచ్చిందాన్ని ఎప్పుడు పోగొట్టుకోను అంటూ జగపతిబాబు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి
Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- రామ్ చరణ్..!
Jasprit Bumrah: తండ్రైన బుమ్రా.. కుమారుడి పేరేంటో తెలుసా!
ఏం పీ***టారో పీక్కోండి.. పవన్ కల్యాణ్ పై హీరోయిన్ మాధవి సంచలన వ్యాఖ్యలు !