Home » రెచ్చిపోతున్న జ‌బ‌ర్ద‌స్త్ జోడీ…నీ మెడ‌లో నా తాలి అంటూ సుజాత‌పై రాకేష్ అరాచ‌కం..!

రెచ్చిపోతున్న జ‌బ‌ర్ద‌స్త్ జోడీ…నీ మెడ‌లో నా తాలి అంటూ సుజాత‌పై రాకేష్ అరాచ‌కం..!

by AJAY
Ad

తెలుగులో జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో అంత‌లా సక్సెస్ అయిన కామెడీ షో మ‌రొక‌టి లేద‌ని సందేహం లేకుండా చెప్పొచ్చు. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది క‌మెడియ‌న్ లకు గుర్తింపు తచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ట్రెండ్ కు త‌గిన‌ట్టుగా జ‌బ‌ర్ద‌స్త్ లో కూడా మార్పులు చేర్పులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఇది వ‌ర‌కూ కేవ‌లం పురుష‌ల‌కు ఆడ‌వాల్ల గెట్ లు వేసి స్కిట్ చేసేవారు కానీ ఇప్పుడు ఆడ‌వాళ్ల‌ను జ‌బ‌ర్ద‌స్త్ లోకి తీసుకుంటున్నారు.

Advertisement

ఇక రీసెంట్ గా జోర్దార్ సుజాత గా గుర్తింపు తెచ్చుకున్న యాంక‌ర్ సుజాత కూడా జ‌బ‌ర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాకేష్ టీమ్ లో సుజాత న‌టిస్తోంది. ఇక్క‌డి వ‌ర‌కూ అంతా బాగానే ఉండ‌గా వారిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉన్న‌ట్టు జ‌బ‌ర్ద‌స్త్ సీన్ లు క‌నిపిస్తున్నాయి. స్కిట్స్ లో అయినా టీవీ షోల‌లోనూ ఇద్ద‌రి మ‌ధ్య పంచ్ లు డైలాగులు చూస్తుంటే ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తోంది.

Advertisement

అయితే టీవీ షోల‌లో ఫేమ్ ప్రేమ‌లు చాలానే క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీఆర్పీ రేటింగ్ ల కోసం ప్రేక్షుల చెవిలో పూలు పెడుతూ ప్రేమ జంట‌లు అంటూ స్టేజిల‌పైనే ప్ర‌పోజ్ లు చేసుకుంటున్నారు. కానీ సుజాత రాకేష్ లు మాత్రం నిజంగానే ప్రేమ‌లో ఉన్నారని జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. అంతే కాకుండా వీరిద్ద‌రూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

ఇక తాజాగా ఎక్స్ ట్రా జ‌బ‌ర్దస్త్ ప్రోమో విడుద‌లైంది. ఈ వీడియోలో రాకేష్ లేడీస్ ఎంపోరియం ఓన‌ర్ గా క‌నిపిస్తుండ‌గా సుజాత కస్ట‌మ‌ర్ లా వ‌చ్చింది. నా మెడలో ఏం బాగంటుంది అని సుజాత అడ‌గ్గా…నీ మెడ‌లో నాతాటి బాగుంటుంది అంటూ స‌మాధానం ఇచ్చాడు. ఇక ఇద్దరి మ‌ధ్య ఏం ఉందో తెలియ‌దు కానీ జ‌బ‌ర్ద‌స్త్ స్టేజిపై మాత్రం ఈ జంట ర‌చ్చ రచ్చ చేస్తోంది.

Visitors Are Also Reading