Home » సర్దార్ గబ్బర్ సింగ్ ముప్పై రోజులు చేశాను..కట్ చేస్తే సినిమాలో లేను.. జబర్థస్త్ మహేష్ ఎమోషనల్..!

సర్దార్ గబ్బర్ సింగ్ ముప్పై రోజులు చేశాను..కట్ చేస్తే సినిమాలో లేను.. జబర్థస్త్ మహేష్ ఎమోషనల్..!

by AJAY
Ad

సినిమా షూటింగ్ తరవాత ఎడిటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో నచ్చిన సీన్లను సినిమాకు ప్లస్ గా నిలిచే అవసరమైన సన్నివేశాలను మాత్రమే ఉంచి మిగతా సన్నివేశాలను కట్ చేస్తూ ఉంటారు. అయితే అలా కట్ చేసే సందర్భంలో ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు నటించిన సన్నివేశాలు కూడా ఎడిటింగ్ లో పోవడం జరుగుతుంది. అలాంటి ఘటనలు అప్ కమింగ్ నటులు ఎక్కువగా ఎదురుకుంటారు. అయితే అలాంటిది తన జీవితంలో కూడా జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు మహేష్ వెల్లడించారు.

Jabardast mahesh

Jabardast mahesh

మహేష్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే జబర్దస్త్ లో ఎంతోమంది కామెడీ తో ఆకట్టుకున్న అనుకున్నమేర సినిమా అవకాశాలు అందుకోలేకపోయారు. కానీ మహేష్ మాత్రం సినిమాల్లో సక్సెస్ అయ్యాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. ఈ సినిమాతో నటుడిగా మంచి పేరు వచ్చింది. అంతే కాకుండా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో చరణ్ కు ఫ్రెండ్ గా నటించి అలరించాడు. ఈ సినిమాలో కూడా తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తనను పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుండి తీసేశారు అని మహేష్ వెల్లడించారు.

Advertisement

Advertisement

సినిమా కోసం ముప్పై రోజులు పనిచేసినట్లు మహేష్ తెలిపారు. సినిమా రిలీజ్ రోజు తన అత్త కూతురుకు ఫోన్ చేసి సినిమా చూడాలని చెప్పా అని సినిమాలో పవన్ కళ్యాణ్ కు టీ ఇచ్చే సీన్ లో ఉంటానని చెప్పినట్టు మహేష్ తెలిపారు. కానీ ఆమె సినిమా చూసి అందులో టీ ఇచ్చారు కానీ నీ ముఖం కనిపించలేదు అని చెప్పినట్టు తెలిపారు. అంతే కాకుండా తాను ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా లో నటిస్తున్నా అని మహేష్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading