భారతీయులు ముఖ్యంగా టీకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు ఒకపూట భోజనం లేకపోయిన పర్వలేదు కానీ టీ లేకపోతే మాత్రం అసలు ఉండలేరు. అందుకే దేశంలో గల్లీకి ఒక టీ స్టాల్ ఉంటుంది. ఇంత డిమాండ్ ఉన్న టీకి ఇందులో కూడా కొన్ని ప్రత్యేకతలు కావాలని కోరుకుంటారు. ఈ తరుణంలోనే అస్సాంలో పభోజన్ గోల్డ్ టీని సిద్ధం చేశారు.
ఇది ఒక ఆర్గాన్ తేయాకు. అత్యంత అరుదైన రకమని చెబుతుంటారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో దీనిని తొలిసారి కేవలం 1 కేజీ మాత్రమే పండించారు. కేజీ తేయాకు అక్షరాల రూ.1లక్షకు అమ్ముడు పోవడం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. జోర్హాట్ లోని వేలం కేంద్రంలో సోమవారం ఈ తేయాకును విక్రయించారు. అస్సాంకు చెందిన ఎసాహ్ టీ బ్రాండ్ దీనిని 1 లక్షల రూపాయలకు దీనిని కొనుగోలు చేసినట్టు వేలం కేంద్ర అధికారి వెల్లడించారు.
Advertisement
Advertisement
ఈ టీ పొడితో తయారయ్యే టీ పసుపు రంగులో ఉంటుందట. ఈ తేయాకును కోసిన తరువాత సహజసిద్ధంగానే బంగారు వర్ణంలోకి మారుతుందట. ఇది టీకి మంచి రుచిని కూడా అందిస్తుంది. ఈ తేయాకు కొనుగోలు చేసిన ఎసాహ్ టీ సీఈఓ విజిత్ శర్మ మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన టీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అందించేందుకు వీలుంటుందని వెల్లడించారు. తాము కేవలం ఒక కిలో మాత్రమే తేయాకును పండించామని పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ యజమాని రాఖీదత్తా చెప్పుకొచ్చారు. ఇది రికార్డు స్థాయిలో ధర పలకడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.
Also Read :
రామ్‌చరణ్ ధరించిన ఈ డెనిమ్ జాకెట్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం..!
చిరంజీవితో వర్మ సినిమా ఆగిపోవడానికి కారణం.. ఆ మూవీయేనా..?