Home » భర్త మరో మహిళతో రిలేషన్ లో ఉన్నా తప్పులేదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..!

భర్త మరో మహిళతో రిలేషన్ లో ఉన్నా తప్పులేదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..!

by Anji

భార్య, భర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. నిండు, నూరేళ్లు ఒకరికొకరూ కలిసి మెలిసి జీవితాంతం తోడు నీడుగా ఉండాల్సిన భార్య భర్తలు అకస్మాత్తుగా చిన్న చిన్న గొడవల కారణంగా విడిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో మళ్లీ కలుసుకుంటారు. కానీ విడాకులు తీసుకున్న తరువాత చాలా తక్కువగా కలుస్తుంటారు. అయితే భార్య నుంచి  చాలా కాలం విడిపోయిన తరువాత మళ్లీ మళ్లీ కలుసుకునే అవకాశం లేకుండా ఉన్న భార్య భర్తల విషయంలో ఢిల్లీ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  ఇలాంటి సందర్భాల్లో భర్త మరో మహిళతో ఉన్నప్పటికీ అది తప్పు కాదని.. హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

అలాంటి ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఫ్యామిలీ కోర్టుకు చెందిన సురేష్ కుమార్ కైట్ మరియు నీనా బన్సల్ కృష్ణ న్యాయమూర్తులు ఒక జంటకు విడాకులను మంజూరు చేశారు. 2005లో వీరు విడిపోయారు. అప్పటి నుంచి విడిగానే జీవిస్తున్నారు. అయితే భార్య తన భర్తపై నేరపూరిత ఫిర్యాదులు చేస్తుండటంతో చాలా వీరిద్దరి మధ్య వివాదాలు జరిగాయి. అతని భార్య ప్రవర్తించిన విధానం భర్త జీవితాన్ని శాంతి దాంపత్య సంబంధాలను కోల్పోయేవిధంగా చేశాయని ఫ్యామిలీ కోర్టు తెలిపింది. గతంలోనే వీరిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. సదరు వ్యక్తి మరో మహిళతో రిలేషన్ లో ఉన్నాడు. వీరికి ఇద్దరూ కుమారులు కూడా ఉన్నారు. ఇక ఈ విచిత్రమైన కేసులో ఫ్యామిలీ కోర్టు భర్త చేసిన దానిని తప్పుపట్టలేదు.

మొదటి రిలేషన్ భార్య వల్ల అతను పొందిన ఇబ్బందులను ధృష్టిలో ఉంచుకొని విడాకులు ఇవ్వనున్నట్టు ఫ్యామిలీ కోర్టు పేర్కొంది. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. చాలా కాలంగా కలిసి లేనప్పుడు సదరు భర్త మరొక మహిళతో సంబంధం పెట్టుకుంటే దాని గురించి ఈ భార్య మాట్లాడకపోవడం మంచిది అని.. చాలా కాలంగా భార్యతో ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి కలుసుకునేందుకు అవకాశం లేనివిధంగా దూరంగా ఉంటున్న సందర్భాల్లో భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం నేరం కాదని తీర్పునిచ్చింది. హైకోర్టు.  ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ కేసులో మొదటి రిలేషన్ లో క్రూరమైన భార్య బిహేవియర్ తో భర్త ఇబ్బందులు పడినట్టు నేరం రుజువు కావడంతోనే కోర్టు ఈ తీర్పును వెల్లడించడం గమనార్హం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హీరో విజయ్ ఇంట వరుస విషాదాలు…ఆయన తండ్రి కూడా మృతి ?

హీరో విజయ్ ఇంట వరుస విషాదాలు…ఆయన తండ్రి కూడా మృతి ?

Visitors Are Also Reading