ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవ్వరైనా రోగనిరోధకశక్తిని పెంచుకుంటేనే బెటర్. లేకుంటే ఎప్పుడూ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. గత మూడు సంవత్సరాల నుంచి కరోనా మహహ్మారీ ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. రోగనిరోధక శక్తి పెంచుకుంటే కరోనా లాంటి ఎన్ని వ్యాధులు వచ్చినా తరిమికొట్టవచ్చు. కరోనా భయం కారణంగా చాలా వరకు ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలోనే వేడి నీటిలో అల్లం కలిపి తీసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : చిరంజీవి నటించిన సినిమాల్లో బాలయ్యకు చాలా ఇష్టమైన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?
Advertisement
వేడి నీటి అల్లం కలిపి తీసుకోవడం వల్ల అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్లు మీ శరరీంలోని రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కేవలం ఇమ్యూనిటీ పెంచడమే కాదు.. ఈ అల్లం నీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి, మెగ్నీషియం, ఇలా ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. చాలా మంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంటారు. ఎలాంటి నొప్పులను అయిన తగ్గించే గుణం అల్లానికి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసం చేయాల్సింది ఏంటంటే ప్రతి రోజూ అల్లం నీరు తాగడమే.
Advertisement
ఇవి కూడా చదవండి : “లైగర్” సినిమాను మిస్ చేసుకున్న ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేశారంటే.?
ఇలా నిత్యం అల్లం నీరు తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. అజీర్తితో బాధపడేవారు అల్లం రసాన్ని తాగితే వారికి ఉపశమనం కలుగుతుంది. అల్లంలో యాంటి ఇన్‌ప్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్లు దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి వాటి నుంచి త్వరగా కొలుకునేలా చేస్తాయి. అల్లం మంచిదే కానీ అల్లం పై పొట్టును తీయకుండా వినియోగిస్తే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. చాలా మంది వేడి నీటిలో కలిపి తాగేటప్పుడు తొక్క తీయకుండా యూజ్ చేస్తుంటారు. నిజానికి అల్లంపై తొక్కలో విషపదార్థాలుంటాయని కొందరు అంటుంటారు. మరి కొందరూ మాత్రం అల్లం తొక్కలోనే అసలు రుచి ఉంటుందని అంటున్నారు. ఇలా ఎవరి వాదనలు వారివి అయినప్పటికీ ఎందుకైన మంచిది విష పదార్థాలుంటే ప్రమాదం కాబట్టి అల్లం పై తొక్క తీసి ఉపయోగిస్తే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసే అన్నపూర్ణమ్మ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?