ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు కోరుకునే వారికి శుభవార్త అనే చెప్పాలి. ఐటీ కంపెనీలు అన్ని ఫ్రెషర్స్ సాలరీని పెంచాయి. సాప్ట్‌వేర్ కంపెనీలలో ఎంట్రీ లెవల్ వేతనాలు పెరిగాయి. దాదాపు ఒక దశాబ్దం తరువాత ఫ్రెషర్స్ వేతనాలు పెరగడం విశేషం. కరోనా మహమ్మారి కారణంగా ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరిగింది. మరొక వైపు ఐటీ కంపెనీలలో ఉద్యోగుల వలస కూడా పెరిగినది. ప్రతిభ ఉన్న ఫ్రెషర్స్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఇండస్ట్రీ నిపుణుల సమాచారం ప్రకారం.. ఫ్రెషర్స్‌కు 15 శాతం నుంచి 60 శాతం వరకు అధిక వేతనాలు లభించనున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజిస్ ఫ్రెషర్స్ వేతనాన్ని రూ.3,65,000 నుండి రూ.4,25,000 కు పెంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మరొక వైపు హెచ్‌సీఎల్ ఇంజినీరింగ్ కళాశాలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. విద్యార్థులతో అనాలిటిక్స్, డిజిటల్ కంటెంట్ కోర్సులను చేయిస్తోంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి రూ.6,00,000 వరకు ఫ్యాకేజీ ఇవ్వనున్నది. హెచ్‌సీఎల్ వేతనాలను పెంచడంతో ఇన్పోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి కంపెనీలు అదేబాట పట్టే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది కోర్సులు పూర్తి చేసి ఐటీ కంపెనీలలో చేరే వారికి వేతనాలు లభించే అవకాశం కనిపిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజిస్ ఆర్థిక సంవత్సరంలో 45,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నది. గత ఏడాది 23వేల ఫ్రెషర్స్‌ను మాత్రమే నియమించుకున్నది. ఈసారి ఆ సంఖ్యను రెట్టింపు చేసింది. ఇన్ఫోసిస్ గత ఏడాది 85వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకోగా.. ఈ ఏడాది 50వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకునే ఆలోచనలో ఉంది. టీసీఎస్ గత ఏడాది 78వేల మందిని నియమించుకోగా.. ఈ ఏడాది 40వేల మందికి ఫ్రెషర్స్‌కు ఉద్యోగవకాశాలు ఇవ్వనున్నది.
Advertisement
Advertisement
ఈ కంపెనీలు కాకుండా చిన్న చిన్న ఐటీ కంపెనీలు కూడా టాలెంట్ ఉన్న ఫ్రెషర్స్ కోసం వేట కొనసాగిస్తూ ఉన్నాయి. ఐటీ రంగంలో గత ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఉద్యోగావకాశాలు ఇచ్చినట్టు నాస్‌కామ్ వెల్లడించింది. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం.. ప్రతి సంవత్సరం ఏటా రూ.18లక్షల ఐటీ ఇంజినీర్లు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వారిలో టాలెంట్ ఉన్న వారిని నియమించుకోవడానికి కంపెనీలు పోటీ పడుతున్నాయి. వైరస్ మహమ్మారి ప్రభావంతో టెక్నాలజి వినియోగం పెరిగింది. దీంతో సాప్ట్‌వేర్ సేవలను అందించే ఐటీ కంపెనీలకు వ్యాపారం కూడా పెరిగింది. పలు రకాల సేవల కోసం అనేక సంస్థలు ఐటీ కంపెనీలపై ఆధారపడుతున్నాయి. వ్యాపారం పెరుగుతుండడం, సేవలను అందించేందుకు సరిపడా టాలెంట్ లేకపోవడం, ఉన్నవారు కూడా మరొక కంపెనీకి వలస వెళ్తుండడంతో కంపెనీలు ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్నాయి.
Also Read :
ఎన్టీఆర్ కి RRR లో నిజంగానే అన్యాయం జరిగిందిగా ! మరి ఇదేంటి జక్కన్నా ?