సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనికి కొన్ని నిర్మాణ సంస్థలపై ఐటీ రైట్స్ జరగడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐటీ రైడ్స్ కలవరానికీ గురిచేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ రైడ్స్ జరిగాయి. దీనికి అసలు కారణమేంటో చూద్దామా.. తెలుగు ఇండస్ట్రీలోనే మైత్రి మూవీ మేకర్స్ మంచి గుర్తింపు సాధించింది. అతి తక్కువ కాలంలోనే భారీ చిత్రాలు నిర్మించే సంస్థగా పేరు తెచ్చుకుంది. వరుసగా చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తూ వస్తోంది నిర్మాణ సంస్థ.
Advertisement
Also Read:రాఘవేంద్రరావు పాటల్లో పండ్లు, పూలు వాడటం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?
తాజాగా ఈ సంస్థపై ఐటి దాడులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. మైత్రి సంస్థ నిర్మిస్తున్నటువంటి సినిమాలకు పెట్టుబడులు ఇతర దేశాల నుంచి వస్తున్నాయని ఆరోపణలు రావడం, దీంతో మాదాపూర్,బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ఐటీ దాడులు చేశారు. ఇక మరో ప్రధాన కారణమేమిటంటే ఈ సంస్థ ద్వారా ఓ ఇద్దరి ఎమ్మెల్యేలు వారి యొక్క అక్రమ సంపాదనను సినిమాల్లో పెడుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఒక ఎమ్మెల్యే తెలంగాణ వ్యక్తి అయితే, మరో ఎమ్మెల్యే ఆంధ్రకు చెందిన వ్యక్తి అని సమాచారం.
Advertisement
Also Read:పెళ్లయి 5 నెళ్లు కాలేదు.. అంతలోనే అనంత లోకాలకు.. అంత దారుణం జరిగిందా..?
మైత్రి సంస్థలు మనీలాండరింగ్ జరుగుతోందనే అనుమానంతోనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. 2017లో ఈ సంస్థను స్థాపించగా వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లు కొడుతూ టాప్ లెవల్ లో నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ పై కూడా దాడులు నిర్వహించారు ఇన్కంటాక్స్ అధికారులు. మైత్రి నిర్మాణ సారథ్యంలో పుష్ప , పుష్ప 2 చిత్రాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో సుకుమార్ నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. దీంతో ఆయనకేమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు ఆరాతీస్తున్నారట.
Also Read:Adipurush : ఆది పురుష్ కు అరుదైన గౌరవం…