రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆరడుగుల అందగాడు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్న ఏకైక తెలుగు స్టార్. సినిమా ఫ్లాప్ అయినా ప్రతీ సినిమాకు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. అంతటి అభిమానాన్ని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్‌కు అభిమానులు కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ప్రపంచమంతా అభిమానులున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రభాస్ సినిమా ఆయన జీవితాన్నే మార్చేసింది. బాహుబలి 2 సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అంతటి ఘన విజయం సాధించిన తరువాత ప్రభాస్ తదుపరి చిత్రం ఎంతో అద్భుతంగా ఉంటుందని అందరూ భావించారు.
Advertisement
బాహుబలి2 తరువాత వచ్చిన సాహో సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఆశించిన మేరకు రాణించలేదు. హిందీలో సాహో మంచి రికార్డు క్రియేట్ చేసినా తెలుగు అభిమానుల అంచెనాలను అందుకోలేకపోవడ విశేషం. ఇటీవల వచ్చిన రాధేశ్యామ్ సినిమా కూడా ప్రేక్షకుల మన్ననలు అందుకోలేకపోయిందనే చెప్పాలి. ఇక ప్రభాస్ జీవితంలో అత్యంత దారుణమైన విషాదరకర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ విషాదకరమైన ఘటన ఏమిటంటే..? ప్రభాస్ తండ్రి మరణం. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ అన్నయ్య కృష్ణంరాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ గోపికృష్ణ మూవీస్ స్థాపించాడు. అదేవిధంగా కొడుకు భవిష్యత్ కోసం చేయని ప్రయత్నం లేదు. సూర్యనారాయణ అనారోగ్యానికి గురై చికిత్సపొందుతూ 2010 ఫిబ్రవరి 12న మరణించాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య శివకుమారి కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఓవైపు తల్లి మరణం, మరోవైపు తల్లి అనారోగ్యం పాలవ్వడంతో అప్పట్లో ప్రభాస్ విషాద ఘటనలో మునిగిపోయాడు.
Advertisement
బాహుబలి సినిమాలో ప్రభాస్ మహారాజు పాత్రలో నటించాడు. మహారాజుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రభాస్‌ను ఆదరించారు. కానీ చనిపోయిన తండ్రి సూర్యనారాయణరాజు ప్రభాస్ మహారాజు పాత్రలో నటిస్తే.. చూడాలనే కోరిక ఉండేది. కానీ ఆయన బ్రతికి ఉన్నప్పుడు ప్రభాస్‌కు అలా రాజుల పాత్రలో నటించే అవకాశం రాలేదు. ఆయన చనిపోయిన తరువాత రాజు పాత్ర ప్రభాస్‌కు వచ్చింది. అలా రాజుగా చూడాలనుకుంటున్న సూర్యనారాయణ ఆ కోరిక తీరకుండానే ఈ లోకం తిరిగి వెళ్లారు. కానీ చనిపోయిన తరువాత బాహుబలి సినిమా ప్రభాస్ మహారాజు పాత్ర పోషించి తన తండ్రి చివరి కోరికను నెరవేర్చాడు. తండ్రి మరణం నుండి ప్రభాస్ చాలా రోజుల వరకు కోల్కోలేకపోయాడు. సినిమా సెలక్షన్ల విషయంలో కూడా కొద్ది రోజుల పాటు ఫ్లాప్ సినిమాలు కూడా పలుకరించాయి. ఆ తరువాత తన కటౌట్‌కి తగ్గ సినిమాలు చేస్తూ.. ఇండియన్ స్టార్‌గా మారిపోయారు.
Also Read :
హీరో సుమన్ నిజంగే 117 ఎకరాలు ఆర్మీ కి ఉచితంగా ఇచ్చారా ? ఇందులో ఉన్న నిజం ఇదే !
అమెరికా అబ్బాయిని జగపతి బాబు ఎందుకు అల్లుడిగా చేసుకున్నాడో తెలుసా…బంధువులు వద్దన్నా…!