నచ్చింది చేసే వాళ్ళు నచ్చినట్టు బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో టాలీవుడ్ హీరో… కమ్ విలన్ జగపతి బాబు కూడా ఒకరు. జగపతిబాబు ముక్కుసూటిగా మాట్లాడుతూ తనకు నచ్చిందే చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంత మంది హీరోలు కులాన్ని నమ్ముకుని కులం పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారు. కానీ జగపతిబాబు ఎక్కడా తన కుల ప్రస్తావన తీసుకురారు. అంతే కాకుండా కులం మతం అనేవి సిల్లీ థింగ్స్ అంటూ కొట్టి పారేస్తారు.
Advertisement
jagapathi-babu-and-family
ఇదిలా ఉండగా జగతిబాబు సింహస్వప్నం సినిమా తో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ఈ సినిమాలో డ్యుయల్ రోల్ లో నటించారు. ఆ తర్వాత పలు సినిమాలు చేయగా గాయం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో చేసిన శుభలగ్నం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో మహిళల్లో జగపతి బాబు క్రేజ్ పెరిగింది.
Advertisement
jagapathi babu daughter marriage
అప్పటి నుండి ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే కొంతకాలం తర్వాత జగపతి బాబు సినిమాలకు క్రేజ్ పూర్తిగా తగ్గిపోయింది. దాంతో తాను హీరోగా పనికిరానని నిర్ణయించుకుని సినిమాలకు దూరమయ్యారు. కానీ లెజెండ్ సినిమాతో జగపతి బాబు విలన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో జగపతి బాబు విలనిజం ఆకట్టుకోవడంతో తర్వాత వరుస ఆఫర్లు అందుకున్నారు. ప్రస్తుతం విలన్ గా నటిస్తూనే హీరోలకు తండ్రి పాత్రలు మరియు డిఫరెంట్ పాత్రలు చేస్తూ బిజీగా మారిపోయారు.
jagapathi babu daughter with husband
ఇదిలా ఉంటే జగపతి బాబు తన పెద్ద కుమార్తె మేఘనకు 2015లో వివాహం చేశారు. అంతే కాకుండా జగపతి బాబు అల్లుడు చాక్ బోవిన్ అమెరికన్ కావడం విశేషం. మేఘన అమెరికాలో పీజీ చదువుతున్న సమయంలో బోవిన్ తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని జగపతిబాబుకు చెప్పగా ఆయన అడ్డు చెప్పలేదట. అంతేకాకుండా జగపతిబాబుకు తన బంధువులు విదేశీయుడితో పెళ్లి ఏంటి…. మన కులం మతం కాని వాడితో పెళ్లి చేయడం ఏంటి అని ప్రశ్నించారట. అయినప్పటికీ తన కూతురు సంతోషం తనకు ముఖ్యమని జగపతి బాబు తన కూతురును అమెరికన్ కు ఇచ్చి వివాహం చేశారు.
Also read :
Advertisement