మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం మెగా అభిమానులను నిరాశ పరిచింది. అసలు కొరటాల దర్శకత్వంలో చిరంజీవి సినిమా అన్నప్పుడు అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నప్పటికీ.. విడుదలైన సమయానికి తగ్గిపోయాయి. వరుసగా పాన్ ఇండియా సినిమా మధ్యలో విడుదలవ్వడం వల్లనో ఏమో కానీ ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. ఓటీటీలో అయినా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా..? అంటే ఇక్కడ అంతకు మించి విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో సత్యదేవ్ శంకర్ పాత్రను పోషించారు. ఓ దళానికి లీడర్ గా కనిపిస్తాడు. అతడు మరణిస్తున్న సమయంలో తన బిడ్డను ఆచార్యకి అప్పగిస్తాడు. ఆ టైంలో చిరు యంగ్ లుక్‌ను వీఎఫ్ఎక్స్ లో మేనేజ్ చేయాలని చూసారు. కానీ ఆ లుక్ మెగా అభిమానులను తీవ్రంగా పెట్టింది. పెడుతూనే ఉందని చెప్పాలి. వాస్తవానికి ఓ లుక్‌ను మహేష్ బాబుకు ఓ సంబంధం ఉందనేది టాక్. అదేంటని ఈ చిత్రంలో రాంచరణ్ పోషించిన సిద్ధ పాత్రకు మహేష్‌ను అడిగాడు కొరటాల.
Advertisement
మహేష్ కనుక ఓకే చెబితే యంగ్ చిరుగా చరణ్‌ను చూపిద్దామనుకున్నాడట. కానీ మహేష్‌కు ఆ పాత్ర నచ్చలేదు. కొరటాల శివ తనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి నో చెప్పడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇంతలోనే చిత్ర నిర్మాతలు మహేష్‌కు రూ.30కోట్లు పారితోషికం ఆఫర్ చేసారట. ఇది కేవలం 15 నిమిషాల పాత్ర కోసమే. అయినా మహేష్ సమయం తీసుకున్నాడట. మహేష్ నో చెప్పకముందే చిరు ఆ పాత్రను చరణ్‌తో చేయించుకుందామని కొరటాలకు చెప్పారట. అదే పారితోషాకాన్ని కన్ఫర్మ్ చేస్తూ చిరు ఆ పాత్ర నిడివిని పెంచాలని కోరటాలకు చెప్పారట. ఇక యంగ్ చిరు పాత్రకు చరణ్‌ను కాకుండా వీఎఫ్ఎక్స్ వాడాల్సి వచ్చిందని తెలుస్తోంది. రాంచరణ్ సిద్ద పాత్రను ఏకంగా 45 నిమిషాల పాటు పెంచేశారు.
Also Read :
సూపర్ స్టార్ కృష్ణ సినిమా విడుదల రోజే ఎందుకు 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చింది.? ఆరోజు ఏమైంది..?
బాల్య వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ఈ అమ్మాయి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!!