సాధారణంగా భారతదేశంలో హిందువులకు,ముస్లింలకు, క్రిస్టియన్లకు తెల్లని దుస్తులు ఆధ్యాత్మిక చిహ్నాలు. ముఖ్యంగా ఆధ్యాత్మికం వైపు వెళుతున్న చాలామంది తెల్లని దుస్తులు, జపమాలలు, ధ్యానాలు చేస్తూ ఉంటారు. ఇక హిందూ మతానికి సంబంధించి హరే రామ హరే కృష్ణ అంటూ వారి చేతిలో ఒక జపమాల పట్టుకొని రోజుకు కొన్ని వేలసార్లు జపాలు చేస్తూ ఆధ్యాత్మిక చింతనతో గడుపుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వారికి మనశ్శాంతి,ఆరోగ్యం, దైవభక్తి సహకరిస్తాయని నమ్మకం.
Advertisement
Also Read;అల్లు ఫ్యామిలీతో గొడవలు…ఇరిటేషన్ వచ్చింది అంటూ చిరంజీవి ఓపెన్ కామెంట్స్..!
ఈ తరహా లోనే సమంత కూడా ఏదో మతం వైపు మళ్ళినట్టు తెలుస్తోంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న ఆమె తీవ్రమైన డిప్రెషన్ వల్ల మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. దీని నుంచి మెల్లిగా బయటకు రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ప్రత్యేకంగా మనశ్శాంతి కలిగించుకోవడం కోసం ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపిందని తెలుస్తోంది. సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత రూమర్లు వచ్చాయి.. వీటన్నింటికీ ఆమె కృంగిపోయి మనశ్శాంతి కరువైంది.
Advertisement
స్వేచ్ఛాయుత జీవనాన్ని గడపడం కోసం ప్రకృతి ప్రసాదించినటువంటి అమ్మతనాన్ని కూడా వద్దనుకుంటుందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆమె డిప్రెషన్ నుంచి బయటపడడం కోసం విడాకుల తర్వాత ఆధ్యాత్మిక యాత్రను కూడా ప్రారంభించింది. ఎంతోమంది గురువులను కలిసింది. మనశ్శాంతి కోసం మార్గాలను వెతికింది. ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా చదివింది. ఇక చివరికి తెల్లని వస్త్రాలు, జపమాల ధరించి ఆధ్యాత్మికతతో మనశ్శాంతిగా జీవించడం కోసం ఇలా మారిందని కొంతమంది అంటున్నారు.
Also Read:మొగల్తూరు లో చిరంజీవి తన ఇంటిని ఎందుకు లిబెర్రీ కి ఇవ్వలేదు ? అసలు కారణం ఇదే !