Home » “సమరసింహారెడ్డి”లో నటించిన ఈ అమ్మాయికి రామ్ చరణ్ కి మధ్య ఇలాంటి రిలేషన్ ఉందా..?

“సమరసింహారెడ్డి”లో నటించిన ఈ అమ్మాయికి రామ్ చరణ్ కి మధ్య ఇలాంటి రిలేషన్ ఉందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

బాలకృష్ణ చిత్రాలు అంటేనే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి సంచలనం సృష్టిస్తాయి. అలాంటి చిత్రాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన చిత్రం సమరసింహారెడ్డి. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం మామూలుగా లేదు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను మొత్తం మోగించింది. ఆ కాలంలోనే 16 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం రికార్డులను నెలకొల్పింది. ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించడానికి కథ కారణం అని చెప్పవచ్చు.. ఈ కథలో ఉండే సెంటిమెంట్ ఈ సినిమాకి ప్రత్యేకంగా నిలిచింది అనుకోవచ్చు.. అదేంటో పూర్తిగా చూద్దాం..

Advertisement

Also Read:రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్ దేవరకొండ.. ఇక జరిగేది పెళ్లేనా..?

ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కానీ ఇచ్చిన మాట కోసం తన సొంత చెల్లెలిగా భావించి బాలకృష్ణ వాళ్ళ కోసం పడే కష్టం ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. బాలయ్య చెల్లెలు కోసం పడే తాపత్రయం చూస్తే కన్నీళ్లు ఆగవు. ఈ విధంగా యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండించారు. అందుకే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది.. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో బాలకృష్ణ కు దివ్యాంగురాలైన చెల్లెలిగా నటిస్తుంది ఒక అమ్మాయి. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సరస్వతి . ఈ సినిమా పేరు చెప్తే ముందుగా గుర్తుకు వచ్చేది సరస్వతి మాత్రమే. అయితే ఇందులో సరస్వతీ పాత్ర చేసిన అమ్మాయి పేరు సహస్ర.

Advertisement

Also Read:పేపర్ లీకేజ్ లో ఎన్ని విచిత్రాలో.. ప్రియురాలు కోసం డీఏఓ పేపర్ కొనుగోలు చేసిన ప్రియుడు..!

ఈమె కొన్ని వందల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక ఈ చిత్రం తర్వాత పై చదువులపై ఆసక్తితో ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం సహస్ర గొప్ప బిజినెస్ మ్యాన్ అయింది. అలాంటి ఈమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకుంది. నేను చిన్నతనంలో చాలా ముద్దుగా ఉండటం వల్ల చిరంజీవి చాలా ప్రేమగా చూసుకునేవారు. రౌడీ అల్లుడు సినిమా చేస్తున్న సమయంలో నన్ను వారి ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళింట్లో రామ్ చరణ్ టెడ్డీబేర్ తో నేను ఆడుకునే దాన్ని, అలా రామ్ చరణ్ నేను మంచి స్నేహితులమయ్యాం. అప్పటి నుంచి మా ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తూనే వచ్చాం. ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్. అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని సహస్ర చెప్పుకొచ్చింది.

Also Read:గొడవ కి ఫుల్ స్టాప్ పెట్టిన విరాట్-షారూఖ్.. ఫ్యాన్ ఖుషీ..!

Visitors Are Also Reading