నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి కలిగి ఉంటుందో అందరికీ తెలిసిందే. నేటికి కూడా టీవీలలో ఆయన సినిమాలు వస్తుంటే అభిమానులు చూస్తుండడం విశేషం. ఎన్టీఆర్ సోలో హీరోగానే కాకుండా మల్టీస్టారర్ చిత్రాలను కూడా చాలానే చేశారు. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో కొండవీటి సింహం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ చిత్రం 1981 అక్టోబర్ 07న విడుదలైంది.
Advertisement
ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో పాటు మోహన్ బాబు కూడా నటించారు. మోహన్ బాబు పాత్రకు తొలుత చిరంజీవిని అనుకున్నారట. కానీ ఆయన సరిగ్గా చేయలేకపోవడం వల్లనే ఆ ఛాన్స్ మోహన్ బాబుకి దక్కింది. అదేలా అంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం చిరంజీవిని ఎంపిక చేయగా.. ఆయనపై 5 రోజుల పాటు షూటింగ్ కూడా చేశారట. కానీ ఆయన ఎన్టీఆర్‌కి ఎదురు తిరిగి డైలాగ్‌లు చెప్పడంలో ఇబ్బంది పడ్డారట. ఎన్టీఆర్ ఆ సినిమా కోసం కేవలం నెల రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారట. చిరంజీవితో సిసినిమా షూట్ చేస్తే ఆలస్యమవుతుందని మోహన్ బాబుని తీసుకున్నారట. ఇక మోహన్ బాబు ఎన్టీఆర్‌కి దీటుగా నటించడం విశేషం.
Advertisement
ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎస్పీ రంజిత్ కుమార్, రాముగా ద్వి పాత్రాభినయం చేశారు. ఇందులో ఎస్పీ రంజిత్ కుమార్ భార్యగా జయంతి, రాముకి జోడిగా శ్రీదేవి నటించారు. రోజా మూవీస్ బ్యానర్ మీద ఎం. అర్జున రాజు , కె. శివరామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అవినీతిని అంతం చేయడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే పోలీస్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమనే చెప్పవచ్చు. చక్రవర్తి సర్వపరిచిన 7 పాటలు కూడా అప్పట్లో ఎవర్ గ్రీన్. కె.ఎస్. ప్రకాశ్ కెమెరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన కొండవీటి సింహం, ఎన్టీఆర్, కె.రాఘవేంద్ర రావుల కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఈ చిత్రాన్ని అప్పట్లో 47 ప్రింట్లతో 43 కేంద్రాల్లో విడుదల చేయగా.. అన్ని కేంద్రాల్లో కూడా 70 రోజులు ఆడింది. దాదాపు 200 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం జరుపుకుంది. 15 కేంద్రాల్లో 100 శత దినోత్సవ వేడుకలు జరుపుకోవడం విశేషం.
Also Read : చిరంజీవి, రామ్ చరణ్ కి లక్కీ తేదీ ఏదో తెలుసా..?