Telugu News » Blog » కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న‌ట్టు చెప్ప‌గానే ఇందిరాదేవి అలా ఎందుకు చేశారు..? ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు ఇవే..!

కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకున్న‌ట్టు చెప్ప‌గానే ఇందిరాదేవి అలా ఎందుకు చేశారు..? ఎవ్వ‌రికీ తెలియ‌ని నిజాలు ఇవే..!

by AJAY

సూప‌ర్ స్టార్ కృష్ణ ఇంట్లో వ‌రుస విషాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గ‌తేడాది కృష్ణ పెద్దకుమారుడు ర‌మేష్ బాబు అనారోగ్యంతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా కృష్ణ మొద‌టి భార్య, మ‌హేశ్ బాబు త‌ల్లి ఇందిరాదేవి సైతం అనారోగ్యంతో క‌న్నుమూశారు. గ‌త నెల‌రోజులుగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆవిడ నేడు తెల్ల‌వారు జామున 4గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్టు స‌మాచారం.

Advertisement

ఇదిలా ఉంటే కృష్ణ స‌తీమ‌ణి అన‌గానే అంద‌రికీ విజ‌య‌నిర్మ‌ల గుర్తుకువ‌స్తారు. కృష్ణ మొద‌ట ఇందిరాదేవిని వివాహం చేసుకోగా ఆ త‌రవాత త‌న కోస్టార్ అయిన విజ‌య నిర్మ‌ల‌ను వివాహం చేసుకున్నారు. కృష్ణకు కుటుంబ స‌భ్యులు సినిమాల్లోకి రాక‌ముందే ఇందిరాదేవితో వివాహం జ‌రిపించారు. వీరికి ర‌మేష్ బాబు, మ‌హేశ్ బాబు తో పాటూ మంజుల సంతానం ఉన్నారు. ఇక కృష్ణ విజ‌య నిర్మ‌ల‌తో పలు సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించారు. సినిమాలు చేస్తున్న క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ట‌.

Advertisement

ఇక అప్ప‌టికే విజ‌య నిర్మ‌ల త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌గా వారికి న‌రేష్ జ‌న్మించాడు. ఓరోజు కృష్ణ విజ‌య నిర్మ‌ల‌ను వివాహం చేసుకున్నారు. ఆ విష‌యాన్ని ఇందిరాదేవికి చెప్పగా ఆమె ఏమీ మాట్లాడ‌కుండా అలాగే ఉండిపోయార‌ట‌. కృష్ణ మాట‌ను ఆమె గౌర‌వించార‌ట‌. ఎలాంటి గొడ‌వ చేయ‌కుండా మౌన‌మే అర్థాంగికారం అన్న‌ట్టుగా ఉండిపోయార‌ట‌.

కృష్ణ రెండో వివాహం చేసుకున్న‌ప్ప‌టికీ ఇందిరా దేవి మాత్రం ఆయ‌న‌తో విడిపోలేదు. అంతే కాకుండా త‌న కుటుంబాన్ని చూసుకుంటూ మీడియాకు దూరంగా ఉన్నారు. ఇక ఏ సినిమా ఫంక్ష‌న్ అయినా విజ‌య నిర్మ‌ల కృష్ణ క‌లిసి వ‌చ్చేవారు. అంతే కాకుండా ఇందిరాదేవి కూడా విజ‌య‌నిర్మ‌ల‌తో మాట్లాడేవారు. ఫంక్ష‌న్ ల‌లో ఇద్ద‌రూ క‌లుసుకునేవారు. భ‌ర్త‌ను అర్థం చేసుకుని కుటుంబం కోస‌మే బ్ర‌తికిన ఇందిరాదేవి గారు మ‌ర‌ణించడం నిజంగా బాధాక‌రం.