Home » హీరోయిన్ క‌ళ్యాణితో ద‌ర్శ‌కుడు సూర్య‌కిర‌ణ్ విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం అదేనా..?

హీరోయిన్ క‌ళ్యాణితో ద‌ర్శ‌కుడు సూర్య‌కిర‌ణ్ విడాకులు తీసుకోవ‌డానికి కార‌ణం అదేనా..?

by Anji
Ad

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ఎంతో హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు వ‌స్తున్నారు. వారిలో కొంద‌రూ మాత్ర‌మే ఎక్కువ కాలం ఉంటారు. కొంత మంది ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోతుంటారు. కొంద‌రూ సినీ ఇండస్ట్రీలోనే కొన‌సాగుతుంటారు. మ‌రికొంద‌రూ సినీ ఇండ‌స్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకొని విడిపోతుంటారు. ఇలా ర‌క‌ర‌కాల సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం సాధార‌ణ‌మే. టాలీవుడ్ న‌టిగా మంచి పేరు తెచ్చుకున్న‌ట్టు న‌టుల్లో క‌ళ్యాణి ఒక‌రు. ఎన్నో తెలుగు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే ఈమె నటుడు, దర్శకుడు సూర్యకిరణ్ పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.


సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. సొంతం సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలం పాటు ఓ వెలుగు వెలిగిన అనంతరం సూర్యకిరణ్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ కావడంతో సినీ అవకాశాలు లేకుండా పోయాయి. 10 సంవత్సరాలపాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న కళ్యాణి దంపతులు అక‌స్మాత్తుగా విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు కారణాలేమిటి అనే విషయం మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య కిరణ్ కారణాలను వెల్లడించారు. మేము విడాకులకు మంజూరు చేసినప్పుడు జడ్జి మమ్మల్ని విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏమిటి అని ప్రశ్నించారు. ఆ సమయంలో నాకైతే ఎలాంటి కారణాలు లేవు మీరు చెప్పండి అని కళ్యాణిని అడిగాను.

Advertisement

Advertisement


అప్పుడు జడ్జి గారు కళ్యాణి ప్రశ్నించి మీ ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా..? నిన్ను హింసిస్తున్నారా..? అంటూ ప‌లు ప్రశ్నలు అడిగారు. ఆమె అన్నింటికీ లేద‌నే సమాధానం చెప్పింది. విడిపోతే పిల్లలు ఎక్కడ ఉంటారని జడ్జి ప్రశ్నించగా.. మాకు పిల్లలు లేరు సార్ అని చెప్పాం. మీరు విడిపోవడానికి పిల్లలే కారణమంటూ మావిడాకులకు కారణాన్ని జడ్జి గారే చెప్పారు. బ‌య‌టికి వచ్చిన తర్వాత సూర్యకిరణ్ కళ్యాణితో ఇలా అన్నాడ‌ట‌. కొద్ది రోజులు ఆగండి. డబ్బులు వచ్చిన తర్వాత అప్పులన్నీ కట్టేద్దాం. తిరిగి మనిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పినట్టు సూర్యకుమార్ వెల్లడించారు. అయితే వీరి విడాకులకు కారణం కేవలం ఆర్థిక ఇబ్బందులు మాత్రమే అని వీరిద్దరు తిరిగి పెళ్లి చేసుకొని ఒకటవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read : 

“చెన్నకేశవ రెడ్డి” సినిమా ప్లాప్ తరువాత బాలకృష్ణ వివి వినాయక్ తో ఏమని చెప్పేవారో తెలుసా ?

సినిమా కోసం కథ వినకుండానే ఒకే చెప్పి ! బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన బాలయ్య బాబు సినిమా ఏదంటే ?

 

Visitors Are Also Reading