Telugu News » Blog » “చెన్నకేశవ రెడ్డి” సినిమా ప్లాప్ తరువాత బాలకృష్ణ వివి వినాయక్ తో ఏమని చెప్పేవారో తెలుసా ?

“చెన్నకేశవ రెడ్డి” సినిమా ప్లాప్ తరువాత బాలకృష్ణ వివి వినాయక్ తో ఏమని చెప్పేవారో తెలుసా ?

by AJAY
Ads

టాలీవుడ్ లోని టాప్ డైరెక్ట‌ర్ ల‌లో వివి వినాయ‌క్ ఒక‌రు. ఇప్పుడంటే వివి వినాయ‌క్ కు హిట్స్ ప‌డ‌టం లేదేమో కానీ ఒక‌ప్పుడు మాత్రం ఇండ‌స్ట్రీలోనే నంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్ గా రానించారు. వివి వినాయ‌క్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు లైన్ లో నిల‌బ‌డేవారు. అంతే కాకుండా మాస్ సినిమాలు తీయాలంటే వివి వినాయ‌క్ మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చేవారు. ఎన్టీఆర్ తో ఆది లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను తీసి స్టార్ హీరోల లిస్ట్ లో నిలబెట్టిన ఘ‌న‌త కూడా వివి వినాయ‌క్ కే ద‌క్కింద‌ని చెప్పాలి.

Ads

ఇటీవ‌లే వివి వినాయ‌క్ హీరోగా సీన‌య్య అనే సినిమాను కూడా ప్రారంభించారు. కానీ ఈ సినిమాను మ‌ధ్య‌లోనే ఆపేశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వివి వినాయ‌క్ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. సుమోలు గాల్లో ఎగ‌ర‌టం అంటే మీరే గుర్తుకు వ‌స్తారు దాన్ని ఎక్క‌డ నుండి ఇన్స్పిరేష‌న్ గా తీసుకున్నార‌ని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా ఎక్క‌డ నుండి తీసుకోలేద‌ని అది స‌డెన్ గా వ‌చ్చిన ఆలోచ‌న అని అన్నారు.

Ads

ఇక వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా చెన్న‌కేశ‌ర‌రెడ్డి సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా అనుకున్న‌మేర విజ‌యం సాధించలేదు. కానీ బాల‌య్య అభిమానుల‌కు మాత్రం ఈ సినిమా తెగ‌న‌చ్చేసింది. అయితే ఈ సినిమా త‌ర‌వాత మీ కాంబినేష‌న్ లో ఎందుకు సినిమా రాలేద‌ని ప్ర‌శ్నించ‌గా వివి వినాయ‌క్ మాట్లాడుతూ…చెన్న కేశ‌ర‌రెడ్డిసినిమా ఫ్యాన్స్ కూ చాలా న‌చ్చింది కానీ ఎందుకో వ‌ర్కౌట్ కాలేద‌ని అన్నారు.

ఇప్ప‌టికీ తాను ఎక్క‌డ క‌నిపించినా త‌న‌ను బాల‌య్య స‌త్తిరెడ్డి అంటూ పిలుస్తార‌ని చెప్పారు. ఇంటిలెజెంట్ త‌ర‌వాత బాల‌య్య బాబుతో సినిమా అనుకున్నామ‌ని అన్నారు. కానీ క‌థ‌లు న‌చ్చ‌క‌పోవ‌డంతో సైలెంట్ గా ఉండిపోయాన‌ని అన్నారు. అంతే కాకుండా ఫ్లాప్ త‌ర‌వాత మంచి క‌థ దొరికితేనే సినిమా చేయాల‌ని అనుకున్న‌ట్టు తెలిపారు.

Ad

ALSO READ: ఉదయ్ కిరణ్ ని చిరు ఫామిలీ లో కలుపుకుందాం అనుకున్నారు కానీ చివరికి..!