తమిళంతో పాటు హిందీలో బిజీగా మారిపోయిన హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నానంటూ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన ధనుష్ అభిమానులనే కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. 18 ఏళ్ల తరువాత ధనుష్ విడాకులు తీసుకోవడం అందరికీ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పుడు ధనుష్ విడాకుల తీసుకోవడానికి ఆ స్టార్ హీరోయిన్ కారణమంటూ ఆమెపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో విడాకులు కూడా అంతే వేగంగా జరిగిపోతున్నాయి. కొందరూ అలాగే దశాబ్దాల పాటు కలిసి ఉంటున్నారు. మరికొందరూ మాత్రం కొద్ది రోజులకే విడిపోతున్నారు. ఈ మధ్య నాగ చైతన్య విడిపోయారు. ఆ తరువాత ధనుస్ కూడా తన భార్యకు విడాకులు ప్రకటించారు. ఐశ్వర్య రజినికాంత్, ధనుష్ దంపతులు దాదాపు 19 ఏళ్లు వివాహ బంధాన్ని అధికారికంగా ముగించారు. ఈ జంట విడాకులు అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు లేవు. బయటికి కూడా రాలేదు. ధనుష్ ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు. తన పని తాను చేసుకుని పోతాడు. ఐశ్వర్య తండ్రి రజినికాంత్ తరహాలోనే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు.
Advertisement
Advertisement
ఐశ్వర్య విడాకుల తరువాత ధనుష్ పై వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. ఇటీవలే ధనుష్ బాలీవుడ్ సినిమా కూడా తీసాడు. ఆత్రాంగిరే సినిమాలో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్‌తో కలిసి నటించాడు. తాజాగా ఓ హాలీవుడ్ సినిమాలో కూడా ధనుష్ నటిస్తున్నాడు. ఇక బాలీవుడ్ నిర్మాత రితేష్ సిధ్వాని దిగ్రే మ్యాన్ ప్రమోషన్ల కోసం ప్రస్తుతం భారత్ లో ఉన్నది రస్సో బ్రదర్స్ – జో మరియు ఆంథోని రస్సో కోసం స్టార్ – స్టడెడ్ పార్టీని నిర్వహించారు. ధనుష్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. సారా అలీఖాన్ తన అత్రంగిరే సహనటుడు ధనుష్‌తో కలిసి రావడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
సారా అతనికి చాలా దగ్గరగా నిలబడి కనిపించారు. ఇప్పుడు నెటిజన్లు వీరిపై కామెంట్లు చేస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే కొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిని ఓవర్ థింక్ చేసి దానిని విస్మరించారు. కొంతమంది నెటిజన్లు ధనుష్ తో సారా అలీఖాన్ అతి ఉత్సాహం క్లోజ్ నెస్ చూసి సారాపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా ధనుష్ మాజీ భార్య ఐశ్వరతో విడాకులు తీసుకోవడానికి సారానే కారణమంటూ ఆమెపై విమర్శలు చేసారు. రజినీకాంత్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాను. ఏ మాత్రం ప్రశాంతత లేదు అన్నారు. కూతురు, అల్లుడు విడాకులు తీసుకున్న తరువాత రజినికాంత్ ఆరోగ్యం మరింత దెబ్బతిన్నదని తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read :
సునీల్ భార్యను ఎప్పుడైనా చూశారా..? ఆమె ఏం చేస్తుందంటే..
లైగర్ సినిమా శాటిలైట్ కి ధర ఎంత పలికిందో తెలుసా..?