Home » ఆ ఒక్క విషయం jr:NTR ను వేధిస్తోందా..చెప్పుకోలేని ఆ బాధేంటంటే..?

ఆ ఒక్క విషయం jr:NTR ను వేధిస్తోందా..చెప్పుకోలేని ఆ బాధేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారంతా ఎంతో గుర్తింపు సాధించారు. వీరందరిలో కెల్లా నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన ఫాలోయింగ్ కూడా మరో లెవల్ లో ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఎన్టీఆర్ కున్న సింప్లిసిటీ.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే గుణం కలిగిన ఎన్టీఆర్ ఇప్పటికీ తాను పాన్ ఇండియా హీరో నని అసలు గర్వం చూపించరు.. అందుకే ఆయన అంతమంది ఫ్యాన్స్ ఉంటారు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కానీ కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా హీరోగా మారారు. అలాంటి ఎన్టీఆర్ ను ఆయన అభిమానులు హీరో కంటే ఎక్కువ సొంత అన్నగా అభిమానిస్తారు.

Advertisement

తాను ఎక్కడికి వెళ్లినా నందమూరి అభిమానుల సెక్యూరిటీ ఆలోచించే ఎన్టీఆర్ తన చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకొని తీవ్రంగా బాధపడుతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మరి ఆ విషయం ఏంటయ్యా అంటే.. హరికృష్ణకు ఎన్టీఆర్ అమ్మ శాలిని రెండవ భార్య.. ముందుగా ఆమెను నందమూరి ఫ్యామిలీ కోడలిగా యాక్సెప్ట్ చేయలేదు. ఎన్టీఆర్ పుట్టిన తర్వాత కూడా ఆయన కుటుంబాన్ని దూరంగానే పెట్టారు. ఈ సందర్భంలో తన బాల్యాన్ని చాలా సమస్యలతో గడిపారు ఎన్టీఆర్. అయితే ఎంతో కష్టపడి స్టార్డం సంపాదించుకున్న తర్వాత నందమూరి ఫ్యామిలీ ఆయనను దగ్గరికి చేర్చుకుంది.

Advertisement

దీంతో ఎన్టీఆర్ తన బాల్యంలో ఎదుర్కొన్న సమస్యలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తరచూ ఎమోషనల్ అవుతారట. అయితే ఒక ఈవెంట్ లో తారక్ తన బాబాయ్ బాలయ్యను పట్టుకొని కేజీ పైనే వెక్కివెక్కి ఏడ్చారు. దీనికి ప్రధాన కారణం బాలయ్య అంటే తారక్కి చాలా ఇష్టం. ప్రజెంట్ వీరంతా కలిసే ఉంటున్నారు. తన కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా అందరూ కలిసే చూసుకుంటారు. ప్రస్తుతం తారకరత్న హెల్త్ కండిషన్ పై వీరంతా జాగ్రత్తగా చూసుకుంటూ వైద్యాన్ని అందిస్తున్నారు.. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్రేట్ అని చెప్పవచ్చు.. మరి NTR పై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి..

also read:

Visitors Are Also Reading